Tuesday, March 3, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Fake News: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు… జాగ్రత్త‌!...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Fake News: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు… జాగ్రత్త‌! ఫేక్ న్యూస్ స‌ర్క్యులేట్ చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Fake News: సోష‌ల్ మీడియా విస్తృతి పెరిగిన‌ప్ప‌టి నుంచి స‌మాచార మార్పిడిలో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌చ్చాయి. 

ప్ర‌పంచంలో ఏ మూల‌న ఏం జ‌రిగినా వెంట‌నే స్మార్ట్ ఫోన్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నాయి. వాట్సాప్‌, ఫేస్‌బుక్ ఇలా ఏ సోష‌ల్ మీడియా సైట్లో చూసినా స‌మాచారం బాగా వ్యాప్తి చెందుతున్నాయి. అయితే ఇది బాగానే ఉన్నా.. ఈ స‌మ‌యంలోనే ఫేక్ న్యూస్ కూడా విస్తృతంగా స‌ర్క్యులేట్ అవుతోంది. ముందూ వెన‌కా చూసుకోకుండా వార్త‌ల‌ను సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు.

అయితే ఇలాంటి ఫేక్ వార్త‌ల‌ను వ్యాప్తి చేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిస్తున్నారు పోలీసులు. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ సిటీ పోలీస్ క‌మిషన‌ర్ అంజ‌నీ కుమార్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. త‌మ గ్రూప్‌ల‌లో నిర్ధారించుకోకుండా ఫేక్ వార్త‌ల‌ను పోస్ట్ చేస్తే క‌ఠిన‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తేల్చి చెప్పారు.

కొండాపూర్‌లో పోలీస్ ఆఫీస‌ర్‌పై దాడి చేశార‌ని..

కొండాపూర్‌లో ఓ పోలీస్ ఆఫీస‌ర్‌పై కొంద‌రు వ్య‌క్తులు దాడి చేసినట్లున్న వీడియో గ‌త నెల 28న సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్‌గా మారింది. హైద‌రాబాద్‌లోని కొండాపూర్‌లో ఈ సంఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు స‌ద‌రు వార్త స‌ర్క్యూలేట్ అయ్యింది. అయితే ఆ సంఘ‌ట‌న గతేడాది అక్టోబ‌ర్‌లో జ‌రిగింద‌ని, అది కూడా కొండాపూర్‌లో కాద‌ని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఇక లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తున్నాడ‌ని పోలీస్ ఆఫీస‌ర్ కూర‌గాయ‌ల వ్యాపారిపై దాడి చేస్తున్న‌ట్లు ఉన్న వీడియోపై మియాపూర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో కేసు న‌మోదైంది. దీనిపై సైబ‌ర్ క్రైమ్ వింగ్‌లోనూ కేసు న‌మోదు చేశారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రుగుతోన్న నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న ఫేక్ న్యూస్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this