Anandaiah Eye Drops: ఆనందయ్య మందుకు తొలగిన...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Anandaiah Eye Drops: ఆనందయ్య మందుకు తొలగిన అడ్డంకి.. ఐ డ్రాప్స్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Anandaiah Eye Drops: నెల్లూరు జిల్లా కృష్ణప‌ట్నం ఆనంద‌య్య ఇస్తున్న మందులో ఒక‌టైన K ఔషధానికి ఏపీహైకోర్టు అనుమ‌తిచ్చింది. 

గ‌తంలో ఆనంద‌య్య ఇత‌ర మందుల‌కు హైకోర్టు ఆదేశాలతో అనుమ‌తిచ్చిన ఏపీ ప్రభుత్వం కంట్లో వేసే చుక్కల మందుకు అనుమ‌తి ఇవ్వలేదు. ఆయుష్ నివేదికకు సంబంధించి పూర్తి వివ‌రాలు రాని నేప‌థ్యలో దీనికి అనుమ‌తి ఇవ్వలేదు. ఈ నేప‌థ్యంలో దీనిపై ఇవాళ హైకోర్టు విచార‌ణ చేపట్టింది. క‌రోనా బాధితుల‌కు త‌క్షణ‌మే K మందు పంపిణీ చేయాల‌ని హైకోర్టు ఆదేశించింది.ఇప్పటికే ఆనందయ్య పసరు మందుకు పర్మిషన్‌ ఇచ్చిన కోర్టు…ఐ డ్రాప్స్‌ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మరోవైపు, ఆనందయ్య మందు పంపిణీ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. నెల్లూరుజిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని గొలగమూడిలో పసరు మందు పంపిణీ ప్రారంభించారు స్థానిక ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డి. గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా డోర్‌ టు డోర్‌.. పంపిణీ షురూ అయ్యింది. కరోనా పాజిటివ్‌ వచ్చినవారికి ముందుగా మందు ఇవ్వాలని నిర్ణయించారు. 3 రోజులపాటు ఇంటింటికీ ఆనందయ్య మందు పంపిణీ చేయనున్నారు.

అయితే, సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మాత్రమే ఆనందయ్య మందు తయారు చేశారు. లక్ష, నుండి లక్షన్నర మందికి మూడు రకాలైన మందులు తయారు చేసినట్టు తెలుస్తోంది. రోజుకు 2 వేల నుండి 4 వేల వరకూ వాలంటీర్లు డెలివరీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ లెక్కన్న ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే మందు పంపిణీకి దాదాపు వారం నుండి 10 రోజులపైనే పడుతుంది.

మరోవైపు అటు చంద్రగిరి నియోజకవర్గంలోనూ ఆనందయ్య కుమారుడు శ్రీధర్‌ మందు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే శేషాచలం అడవుల్లో నుండి పెద్దయెత్తున్న వనమూలికలను తెప్పించారు స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. రోజుకు రెండు టన్నుల మందు తయారీ లక్ష్యంగా పని చేస్తున్నారు. పని ప్రారంభమై నాలుగైదు రోజులైనా…ఇవాళ సాయంత్రానికల్లా మందు తయారీ పూర్తవుతుందని చెబుతున్నారు. అయితే వాటిని మందు గుళికలుగా మార్చి, పంపిణీకి సిద్ధం చేయడానికి మరో రెండ్రోజులైనా పడుతుందని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో బుధవారం లేదా…గురువారం నుండి చంద్రగిరిలో మందు పంపిణీ షురూ కావొచ్చని…అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నారని తెలుస్తోంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this