Vaccine Certificate: టీకా ధ్రువపత్రంలో తప్పులా?

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Vaccine Certificate: టీకా ధ్రువపత్రంలో తప్పులా?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కరోనా టీకా ధ్రువపత్రంలో పేరు, పుట్టినతేదీ వంటి వివరాల్లో తప్పులొచ్చాయా? 

అయినా కంగారుపడాల్సిన అవసరం లేదు. కొవిన్‌ వెబ్‌సైట్‌ ద్వారా వాటిని సరిచేసుకునే వీలు కల్పించింది కేంద్ర ప్రభుత్వం.

Vaccine Certificate: కొవిడ్‌ వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌లో మార్పులు చేసుకునేలా వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసినట్లు బుధవారం వెల్లడించింది.

“కొవిన్‌ నమోదు సమయంలో పేరు, పుట్టినతేదీ, లింగం వంటి వివరాలను పొరబాటుగా తప్పుగా ఇస్తే టీకా ధ్రువపత్రంలో వాటిని సరిచేసుకోవచ్చు’ అని ఆరోగ్యసేతు ట్విటర్‌ ఖాతాలో కేంద్రం ట్వీట్ చేసింది. ఇందుకోసం కొవిన్‌ పోర్టల్‌లో ‘రైజ్‌ యాన్‌ ఇష్యూ’ అనే ఫీచర్‌ను యాడ్‌ చేసింది. దేశీయ, విదేశీ ప్రయాణాల సమయంలో ఈ టీకా ధ్రువపత్రాల అవసరం ఏర్పడుతుంది.

తప్పులు ఎలా సరిచేసుకోవాలంటే..

  • www.cowin.gov.in పోర్టల్‌ను ఓపెన్‌ చేయాలి.
  • మీ పది అంకెల మొబైల్‌ నంబరుతో లాగిన్‌ అవ్వాలి.
  • ఆ తర్వాత మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వెరిఫై చేస్తే మీ ఖాతా ఓపెన్‌ అవుతుంది.
  • ఆ తర్వాత Account Details అనే బటన్‌ని క్లిక్‌ చేయాలి. మీరు వ్యాక్సిన్‌ వేయించుకుంటే మీకు Raise an Issue అనే బటన్‌ కన్పిస్తుంది. దాన్ని క్లిక్‌ చేయాలి.
  • అప్పుడు Correction In Certificate(ధ్రువపత్రంలో కరెక్షన్‌) ఆప్షన్‌ కన్పిస్తుంది. దాన్ని క్లిక్‌ చేస్తే పేరు, పుట్టినతేదీ, జెండర్‌లో మార్పులు చేర్పులు చేసుకునేందుకు ఆప్షన్స్‌ కన్పిస్తాయి.

గమనిక: అయితే యూజర్లు తమ టీకా ధ్రువపత్రాన్ని ఒకేసారి ఎడిట్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అప్‌డేట్‌ చేసిన సమాచారం తుది ధ్రువపత్రంపై కన్పిస్తుంది.




వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this