AI: విద్యా రంగంలో ఏఐ సరికొత్త విప్లవం.....

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AI: విద్యా రంగంలో ఏఐ సరికొత్త విప్లవం.. గూగుల్‌ బార్డ్‌లో సూపర్ ఫీచర్‌.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

AI: విద్యా రంగంలో ఏఐ సరికొత్త విప్లవం.. గూగుల్‌ బార్డ్‌లో సూపర్ ఫీచర్‌.

ఇదిలా ఉంటే ఓవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ద్వారా ఎన్నో రకాల దుష్ఫ్రభావాలు ఉన్నాయన్న వాదనలు జరుగుతున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న డీప్‌ ఫేక్‌ వీడియో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ కొత్త టెక్నాలజీతా నష్టాలు ఉన్నట్లే, లాభాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా విద్యా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ విప్లవాత్మక మార్పులకు…
ai: విద్యా రంగంలో ఏఐ సరికొత్త విప్లవం.. గూగుల్‌ బార్డ్‌లో సూపర్ ఫీచర్‌.

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ప్రపంచాన్ని శాసిస్తోంది. వినోదం, విజ్ఞానం.. ఇలా అన్ని రంగాల్లో ఏఐ వినియోగం అనివార్యంగా మారింది. ఇప్పటికే ఏఐ ఆధారిత చాట్‌బాట్‌లకు డిమాండ్‌ పెరుడుతోంది. చాట్‌జీపీటీతో పాటు గూగుల్‌ బార్డ్‌ పేరుతో చాట్‌బాట్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఓవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ద్వారా ఎన్నో రకాల దుష్ఫ్రభావాలు ఉన్నాయన్న వాదనలు జరుగుతున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న డీప్‌ ఫేక్‌ వీడియో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ కొత్త టెక్నాలజీతా నష్టాలు ఉన్నట్లే, లాభాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా విద్యా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. తాజాగా గూగుల్‌ చాట్బాట్‌ బార్డ్‌లో తీసుకొచ్చిన ఓ కొత్త ఫీచర్‌ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడనుంది.
మొదట్లో అమెరికా, యూకేలో అందుబాటులోకి వచ్చిన గూగుల్ బార్డ్‌ ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం గూగుల్‌ బార్డ్‌ను భారత్‌తో పాటు 108 దేశాల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటూ వస్తోన్న గూగుల్‌ తాజాగా విద్యార్థుల కోసం కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. విద్యార్థుల.. సైన్స్ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన సలహాలు, పాఠశాలలు, కాలేజ్ స్టూడెంట్స్‌కి ఉపయోగపడేలా ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు.
ఈ ఫీచర్‌ సహాయంతో యూజర్లు.. మ్యాథ్స్, సైన్స్, క్లిష్టమైన సమస్యలకు సమాధానాలను సులభమైన విధానంలో తెలుసుకునేలా బార్డ్‌ను అప్‌డేట్ చేశారు. ఇందుకోసం యూజర్లు తమకు కావాల్సిన సమస్యను టైప్‌ చేయడం లేదా ఫొటోను అప్‌లోడ్ చేస్తే చాలు సమస్యను ఎలా పరిష్కరించవచ్చో సులభమైన విధానాన్ని చాట్‌బాట్‌ అందిస్తుంది. విద్యార్థులకు అర్థం అయ్యే విధంగా చార్ట్‌లు, టేబుల్స్‌ రూపంలో ఉంటాయి. వీటితో పాటు అన్ని రకాల పరీక్షలకు సంబంధించిన సూచనలు కూడా పొందవచ్చు.

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this