Quality Education: నాణ్యమైన విద్యలో ...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Quality Education: నాణ్యమైన విద్యలో వెనుకబాటు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • జాతీయ స్థాయిలో రాష్ట్రానికి 19వ స్థానం
  • నీతి ఆయోగ్‌ ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు’ నివేదికలో వెల్లడి

Quality Education: నాణ్యమైన విద్యలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ 19వ స్థానంలో నిలిచింది. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక కంటే వెనుకబడింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికపై ఇటీవల నీతి ఆయోగ్‌ (2020-21) నివేదికను విడుదల చేసింది. మొత్తం 17 లక్ష్యాలు- సాధించిన పురోగతి ఆధారంగా నివేదికను రూపొందించగా ఇందులో అందరికీ నాణ్యమైన విద్యను అందించడం నాలుగో లక్ష్యంగా నిర్దేశించారు. నాణ్యమైన విద్యకు 11 అంశాల ప్రామాణికంగా స్కోరును కేటాయించారు. ఏపీకి 50 పాయింట్లు వచ్చాయి. గత 2019-2020 నివేదికలో 52 పాయింట్లతో 18వ స్థానంలో నిలవగా.. ఈసారి 19కి పడిపోయింది. నాణ్యమైన విద్యలో 100 పాయింట్లకు కేరళ 80 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. బిహార్‌ 29 పాయింట్లతో అట్టడుగున నిలిచింది.

అక్షరాస్యతలో 27వ స్థానం

15ఏళ్లు, ఆపైబడిన వారి అక్షరాస్యతలో 65.60 శాతంతో రాష్ట్రం 27వ స్థానంలో నిలిచింది. ఇది జాతీయ సరాసరి 74.6 కంటే తక్కువ. బిహార్‌ 64.7 శాతంతో చివరి స్థానంలో నిలిచింది.  

సెకండరీ స్థాయిలో 9-10 తరగతుల్లో ఏడాదికి బడి మానేస్తున్నవారు రాష్ట్రంలో 16.37 శాతం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. జాతీయ సరాసరి   17.87 కంటే తక్కువగా ఉన్నా.. జాతీయ స్థాయిలో 14వస్థానంలో నిలిచింది.

స్థూల ప్రవేశాల నిష్పత్తి 11-12 తరగతుల్లో (ఇంటర్మీడియట్‌) 46.84 శాతంగా ఉంది. దేశంలో 17వ స్థానంలో నిలవగా జాతీయ సరాసరి కంటే కొంచెం మెరుగ్గా ఉంది.

ఎనిమిదో తరగతి అభ్యాసనా ఫలితాల్లో 80.2 శాతంతో ఆరో స్థానంలో నిలిచింది. విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు మెరుగ్గా ఉన్నాయి.

సెకండరీ స్థాయి (9-10) తరగతుల విద్యార్థులకు బోధించే శిక్షణ పొందిన ఉపాధ్యాయులు 75.18శాతం ఉన్నారు. ఇది జాతీయ సరాసరి కంటే తక్కువగా ఉంది. దేశంలో ఏపీ 20వ స్థానంలో నిలిచింది.

పాఠశాలల మౌలిక సదుపాయాల్లో జాతీయ స్థాయిలో 13వ స్థానంలో  నిలిచింది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this