Old Currency: పాత, చిరిగిన నోట్లను బ్యాంకుల్లో...

AP Inter Results 2026 Today Live: Direct Links for 1st & 2nd Year Results, WhatsApp Mana Mitra Process, SMS Method

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

Old Currency: పాత, చిరిగిన నోట్లను బ్యాంకుల్లో మారుస్తున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Old Notes: చిరిగిన, పాతపడిపోయిన నోట్లను చాలామంది పనికిరావని పరిగణనలోకి తీసుకుంటారు. కానీ రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా మాత్రం.. ఆ నోట్లను బ్యాంకులకు వెళ్లి మార్చుకోవచ్చు అని చెబుతోంది. చిరిగిన, పాత నోట్లను మార్చేందుకు బ్యాంకులు పలు ఛార్జీలను వసూలు చేస్తాయి. అసలు బ్యాంకులు ఎంతెంత ఛార్జీలు వసూలు చేస్తాయి.? వేటిని పరిగణలోకి తీసుకుంటాయి.? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.!

ఎలా మార్చవచ్చు?

మీ వద్ద పాత లేదా చిరిగిన నోట్లు ఉంటే, మీరు వాటిని దగ్గరలోని బ్యాంకుకు తీసుకెళ్లి మార్చుకోవచ్చు. మీరు ఇచ్చిన నోట్లకు అదే మొత్తంలో డబ్బు తిరిగి ఇస్తారని మాత్రం అనుకోవద్దు. ప్రతీ నోటును మార్చేందుకు బ్యాంకు కొంత ఛార్జీ వసూలు చేస్తుంది. ఉదాహరణకు.. 2000 రూపాయల నోటు 88 చదరపు సెంటీమీటర్లు అయితే, మీకు పూర్తి డబ్బు లభిస్తుంది. కానీ 44 చదరపు సెం.మీ.లో ఉంటే సగం మొత్తం ఇస్తారు. అలాగే మీరు 200 రూపాయల చిరిగిన నోటు 78 చదరపు సెంటీమీటర్లు అయితే.. మీకు పూర్తి డబ్బు లభిస్తుంది. కానీ 39 చదరపు సెంటీమీటర్ల నోటుకు అయితే.. సగం డబ్బు వస్తుంది.

ఎంత వసూలు చేస్తారు?

మీ దగ్గర రూ. 20 నోట్లు.. రూ. 5 వేల కంటే తక్కువ ఉంటే.. ఎటువంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ రూ. 5 వేలు దాటితే మాత్రం ఛార్జీ పడుతుంది. 20 కంటే ఎక్కువ నోట్లు ఉంటే, ఒక్కో నోటుపై రెండు రూపాయలు వసూలు చేస్తారు. అంతేకాకుండా జీఎస్టీ అదనంగా చెల్లించాలి. ఒకవేళ రూ. 5 వేల కంటే విలువ ఎక్కువ ఉంటే.. నోట్‌కు రూ.2 నుంచి రూ. 5 చెల్లించాలి.

ఎలాంటి నోట్లు మార్చబడవు..!

పాత, చిరిగిన నోట్లను సులభంగా మార్చుకోవచ్చునని ఆర్బీఐ సూచించింది. అయితే, కాలిన లేదా చెదలుపట్టిన నోట్లను మార్చుకోవడం కుదరదని తేల్చింది. అలాగే మీరు ఉద్దేశపూర్వకంగా నోటును చింపినా లేదా కత్తిరించినట్లు బ్యాంక్ అధికారి గుర్తిస్తే, అలాంటి నోట్లను తీసుకోరు అని స్పష్టం చేసింది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this