Crime News: ”ఒక్క రూపాయి ఇస్తే రూ.కోటి...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Crime News: ”ఒక్క రూపాయి ఇస్తే రూ.కోటి ఇస్తా”.. ఆన్‌లైన్‌లో మార్కెట్‌లో టీచర్‌కు కుచ్చు టోపీ.!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Cyber Crime News: ఎంత ప్రయత్నించినా సైబర్‌ నేరగాళ్లకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాం. కొత్త పంధాలను ఎంచుకుంటూ.. ఫ్రీ ఆఫర్స్ ఆశ చూపి.. అమాయకులను దోచేసుకుంటున్నారు. ప్రతి నిత్యం ఎక్కడో అక్కడ, ఎవరో ఒకరు ఈ సైబర్‌ ఉచ్చులో పడిపోతున్నారు. తాజాగా టీచర్ అయిన ఓ మహిళ ఈ కేటుగాళ్ల ఉచ్చులో పడి భారీగా డబ్బును పోగొట్టుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

ఆన్‌లైన్ యాప్ OLXలో తన వద్ద ఉన్న 1947వ సంవత్సరం రూపాయి కాయిన్‌ను సదరు టీచర్ అమ్మకానికి పెట్టారు. జూన్ 15న పెట్టిన పోస్టులో తన మొబైల్ నెంబర్‌ను సైతం యాడ్ చేశారు. దీన్ని గమనించిన ఓ కేటుగాడు పక్కా ప్లాన్‌తో స్కెచ్‌ వేసాడు. సదరు టీచర్‌కు ఆ కాయిన్ కొనడానికి నేను రెడీగా ఉన్నానని కోటి రూపాయలు వరకూ ఇవ్వగలనని అన్నాడు. అంతే జాక్‌పాట్ తగిలిందని భావించిన టీచర్.. నమ్మేసింది. అక్కడితో అతని నాటకం మొదలైంది.

డబ్బు పంపించడానికి బ్యాంకు అకౌంట్ వివరాలు అడిగాడు. టీచర్‌ పూర్తి డీటైల్స్‌ ఫుల్ క్లారిటీతో అన్ని వివరాలు చెప్పిన తర్వాత ఆమెకు ఓ స్క్రీన్ షాట్ వచ్చింది. తాను డబ్బులు పంపానని ఇదే ఆ ట్రాన్సక్షన్ స్క్రీన్ షాట్ అని చెప్పాడు. తనకు డబ్బులు రాలేదని తెలుసుకున్న టీచర్ ప్రశ్నించేందుకు అతనికి తిరిగి ఫోన్ చేసింది. అంత పెద్ద మొత్తం అమౌంట్ ఖాతాలో డిపాజిట్ అవడానికి కొన్ని ట్యాక్స్‌లు లాంటివి కట్టాలని చెప్పాడు. కొంచెం ఖర్చు అవుతుందని అలా చేస్తే డబ్బు జమ అవుతుందని అన్నాడు. ఆర్బీఐ, ట్యాక్స్ కూడా కట్టాల్సి ఉందని మరోసారి చెప్పాడు. ఇలా టీచర్ ఫోన్ చేసిన ప్రతిసారి నగదు జమ పూర్తి కావడానికి ఏదో ఒక కారణంతో డబ్బులు అడుగుతూనే ఉన్నాడు. ఆమె ఇస్తూనే ఉంది. ఎన్నిసార్లు మనీ పంపినా ఏదో ఒక కారణం చెప్పడంతో విసిగిపోయిన టీచర్.. కోటి వస్తుందా రాదా అని గట్టిగా నిలదీసింది. దాదాపు లక్షల్లో ట్రాన్సఫర్ చేసిన ఆమెకు రెస్పాన్స్ రావడం ఆగిపోయింది. అప్పటికి తేరుకున్న మహిళ పోలీసులను ఆశ్రయించింది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this