Joint Staff Council on Demands: జాయింట్‌...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Joint Staff Council on Demands: జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ కు సన్నాహాలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • పెండింగు సమస్యల సమాచారం క్రోడీకరణ
  • సీఎస్‌ ఆఫీసు నుంచి సంఘాల నాయకులకు ఫోన్లు

న్యూస్ టోన్, అమరావతి: Joint Staff Council – ఆంధ్రప్రదేశ్‌ లో గుర్తింపు పొందిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలతో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే ఈ సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే ఉద్యోగ సంఘాలకు తెలియజేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ కార్యాలయం నుంచి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు ఫోన్లు వచ్చాయి. పెండింగు సమస్యల జాబితా పంపాలని వారిని కోరినట్లు తెలిసింది. ఇటీవలే ఏపీ ఎన్‌ జీ వో,జేఏసీ, అమరావతి జేఏసీ నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చారు. మిగిలిన గుర్తింపు సంఘాల నుంచి కూడా సమాచారం తీసుకుని క్రోడీకరిస్తున్నారని సమాచారం. ఈ నెల 18,19తేదీల్లో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షెడ్యూలు ఆధారంగా తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంది. పీఆర్సీ పై అక్షోబరు నెలాఖరు లోపు నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ పెద్దలు చెప్పిన నేపథ్యంలో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ భేటీ ఎప్పుడు ఖరారవుతుందని ఉద్యోగ సంఘాలు ఎదురుచూస్తున్నాయి.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this