Sunday, March 1, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Aided Teacher Transfers: ఎయిడెడ్ టీచర్ల...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Aided Teacher Transfers: ఎయిడెడ్ టీచర్ల బదిలీల ఉత్తర్వులు విడుదల

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • 31లోపు విద్యార్థుల సర్దుబాటు

న్యూస్ టోన్ -అమరావతి బ్యూరో రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ కమిషనరు వి చినవీరభద్రుడు సోమవారం విడుదల చేశారు. ఎయిడెడ్ పాఠశాలల్లోని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. తల్లిదండ్రుల నుంచి లిఖితపూర్వక అనుమతితో ఈ నెల 18 నుంచి 31 వరకు విద్యార్థుల సర్దుబాటు ప్రక్రియ పూర్తిచేయాలని పేర్కొంది. 20 నుంచి 22 వరకు ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను జిల్లా స్థాయిలో విద్యాశాఖ అధికారులు రూపొందించాలి. ఈ జాబితా పై అభ్యంతరాల కోసం 23వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ప్రదర్శించాలి. 24 నుంచి 27 వరకు ఉపాధ్యాయులు అభ్యంతరాలు తెలపొచ్చు. జాబితాపై వచ్చిన అభ్యంతరాలను తొలగించి, జిల్లా స్థాయిలో తుది జాబితాను 31న అధికారులు ప్రదర్శించాలి. యాజమాన్యాల వారీ ఖాళీల వివరాలను నవంబరు 1న పొందుపరచాలి. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా నవంబరు 2 నుంచి 5 వరకు ఉంటుంది. నవంబరు 6న బదిలీఉత్తర్వులను విద్యాశాఖ విడుదల చేస్తుంది. నవంబరు 7న బదిలీ అయిన ఉపాధ్యాయులు కొత్త పాఠశాలలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. – రాష్ట్రప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలకు సహాయం నిలుపుదల విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 6,882 మంది ఉపాధ్యాయులు ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్నారు. వీరిలో 5 సుమారు నాలుగు వేలకు పైగా ఉపాధ్యాయులను ఆ విద్యాశాఖకు అప్పగించేందుకు యాజమాన్యాలు అంగీకరించాయి. బదిలీల వీరందరినీ మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో  విద్యాశాఖ సర్దుబాటు చేయనుంది. ఈ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను దగ్గర్లోని ప్రభుత్వ – పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని ఆదేశించింది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులను కిలోమీటర్ 5 పరిధిలోని ప్రాథమిక పాఠశాలలో, ప్రాథమికోన్నత విద్యార్థులను 3 కిలోమీటర్ల పరిధిలో, ఉన్నత పాఠశాల స్థాయి వారిని 5 కిలోమీటర్ల పరిధిలోని – ఉన్నత పాఠశాలలో సర్దుబాటు చేస్తారు. ఒకవేళ  దగ్గర్లో పాఠశాల అందుబాటులో లేకపోతే కొత్తవి  ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని  విద్యాశాఖ ఇటీవల ఆదేశించింది. విద్యార్థుల సర్దుబాటు తరువాత ఉపాధ్యాయులను ప్రభుత్వ బడుల్లో విలీనం చేయనుంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this