Viral Video: ఓ యువతా ఇదేనా మీకు...

AP Inter Results 2026 Today Live: Direct Links for 1st & 2nd Year Results, WhatsApp Mana Mitra Process, SMS Method

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

Viral Video: ఓ యువతా ఇదేనా మీకు చదువు నేర్పిన సంస్కారం.. గుండె మండే వీడియో ఇది..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Viral Video: ‘సృష్టిలో కమ్మనైన పదం అమ్మ. అమ్మే ఒక అద్భుతం.. అమ్మ లేని జన్మ వృథా.. ప్రతి అమ్మా అపురూపం..’ ఇలా పొద్దున లేస్తే.. అమ్మతనం గురించి కమ్మని పదాలు వల్లిస్తూ ఉంటారు జనం.

Viral Video: ‘సృష్టిలో కమ్మనైన పదం అమ్మ. అమ్మే ఒక అద్భుతం.. అమ్మ లేని జన్మ వృథా.. ప్రతి అమ్మా అపురూపం..’ ఇలా పొద్దున లేస్తే.. అమ్మతనం గురించి కమ్మని పదాలు వల్లిస్తూ ఉంటారు జనం. టైమ్ దొరికితే చాలు.. టాపిక్ వస్తే చాలు.. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియాలో అందమైన పదాలతో పొద్దున లేస్తే పోస్టులతో ఊదరగొడుతుంటారు. అమ్మ ప్రేమ అంటూ స్టేటస్‌లు, రీల్స్, సోషల్ మీడియా పోస్టులతో.. ఓ ఇలా చెప్పుకుంటూ పోతే కథ రకరకాలుగా ఉంటుంది. ఈ దునియాలో అమ్మపై ప్రేమ మాకంటే ఎవరికీ ఎక్కువ లేదన్నట్లుగా రెచ్చిపోతారు. కానీ నిజంగా ఎంత మంది రియల్ లైఫ్‌లో అమ్మను గౌరవిస్తారంటే చెప్పేందుకు ఈ ఒక్క వీడియో చాలు..
ఈ ఒక్క వీడియో చెబుతుంది చదువుకున్న వారి మనస్తత్వం ఎంతలా పరిణతి చెందిందో.. ఈ ఒక్క వీడియో చెబుతుంది మనుషుల్లో మానవతా విలువలు ఏపాటి ఉన్నాయో, పెద్దల పట్ల గౌరవం ఏ రేంజ్‌లో ఉందో.. ఈ ఒక్క వీడియో చెబుతున్న సెల్ ఫోన్లు మనిషి జీవితాన్ని ఎంతలా ఆక్రమించాయో, మనుషులను ఎంతటి మూర్ఖులుగా మారుస్తున్నాయో..
తాజాగా ఓ మహిళ నెలల వయసున్న శిశువుతో హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తోంది. అయితే, ఆ మెట్రోలో ఖాళీ సీట్లు లేవు. దాంతో చంటి బిడ్డను ఎత్తుకుని నిలబడలేక ఆ మహిళ మెట్రోలో కిందనే కూర్చుంది. ఏడుస్తున్న బిడ్డను ఒడిలో కూర్చొబెట్టుకుని లాలిస్తుంది. అయితే, సీట్లలో అంతా యుక్త వయస్కులైన అమ్మాయిలే ఉన్నారు. ఆ తల్లి పసిబిడ్డను ఎత్తుకుని కింద కూర్చోవడం వారూ గమనించారు. కానీ ఏ ఒక్కరూ ఆ తల్లికి సీటు ఇవ్వాలని భావించలేదు. సాటి మహిళ.. చంటి బిడ్డను ఎత్తుకుంది అనే కనీసం ఇంగితం కూడా లేదు. పైగా ఈ ప్రపంచంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నట్లు కొందరు పూర్తిగా ఫోన్లలో మునిగిపోయారు. ఇంకొందరు సొల్లు కబర్లు చెబుతూ వారి వారి ముచ్చట్లలో మునిగిపోయారు.
అయితే, సదరు మహిళ తన చంటి బిడ్డతో మెట్రోలో కింద కూర్చోగా.. అక్కడే నిలబడి ప్రయాణిస్తున్న మరికొందరు తమ ఫోన్‌తో వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదీ మన సంస్కారం అంటూ క్యాప్షన్ పెట్టి.. నేటి యువతకు ఏ స్థాయిలో విలువలు ఉన్నాయో తులనాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతోంది. మానవత్వం లేని ప్రయాణికుల తీరును నెటిజన్లు ఓ రెంజ్‌లో తిట్టిపోస్తున్నారు.
‘‘కనీసం మానవత్వం సంస్కారం లేని చదువులు ఎందుకు మనకు?? స్మార్ట్ ఫోన్ వచ్చాక మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరచిపోయి లేని ప్రపంచం కోసం వెతుకుతున్నాం. ఆ వెతుకులాటలో మానవత్వ విలువలు మరిచిపోతున్నాం బహుశా అభివృద్ధి అంటే ఇదేనేమో. సమాజం మారే స్థితిలో లేదు అని అర్ధం అయిపోయింది. ప్రతి బోగీలో కొన్ని సీట్లు కేటాయిస్తే మంచిది. ఇలా పాలు ఇచ్చే తల్లులకు, గర్భిణీ స్తీలకు విడిగా ఒక చిన్న భోగి ఉంటే ఇంకా మంచిది. ఎందుకు అంటే అలా ఒడిలో కూర్చొని పెట్టుకుని పాలు ఇవ్వడం అమ్మకి సౌకర్యం.. సీట్‌లో కూర్చుని ఇవ్వలేరు.’’ అంటూ ఓ నెటిజన్ ఉద్వేగపూరితమైన కామెంట్ చేశారు.
ఓ యువతా.. కొంచెం మారు.. వాట్సాప్ స్టేటస్‌లలో, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ పోస్టులలో మాత్రమే తల్లిపై ప్రేమను చూపడం కాదు. కాస్త వాస్తవ జీవితంలోకి రా.. ఉన్నత చదువులు చదవగానే సరిపోదు.. కాస్త ఇంగిత జ్ఞానం, విలువలు, పెద్దలకు మర్యాద ఇవ్వడం నేర్చుకో.. జన్మనిచ్చిన తల్లికి ఎలా గౌరవం ఇవ్వాలో తెలుసుకో..

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this