Aided Schools Willing Withdrawal: సమ్మతిని వెనక్కి...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Aided Schools Willing Withdrawal: సమ్మతిని వెనక్కి తీసుకుంటున్న యాజమాన్యాలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  •  తీవ్ర ఒత్తిడితోనే సమ్మతి తెలిపాం!

అమరావతి: ఆస్తులతో సహా లేదా సిబ్బందిని వెనక్కి ఇవ్వాలని ఎయిడెడ్‌ విద్యా సంస్థలపై ఒత్తిడి చేయబోమని, అప్పగించని వాటికి గ్రాంట్‌ కొనసాగిస్తామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీతో కొన్ని యాజమాన్యాలు పునరాలోచనలో పడ్డాయి. గతంలో ఇచ్చిన సమ్మతిని వెనక్కి ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖకు లేఖలు రాస్తున్నాయి. సుమారు 26 సంస్థలు ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. 6 జిల్లాల్లో  విద్యా సంస్థలు కలిగిన రోమన్‌ క్యాథలిక్‌ మిషన్‌(ఆర్‌సీఎం) పాఠశాల విద్యాశాఖ సంచాలకుడికి లేఖ రాసింది. మరో 15 ఇతర యాజమాన్యాలు అదేబాటలో ఉన్నాయి. ఇదే సమయంలో ఎయిడెడ్‌ పాఠశాలలను కొనసాగించాలని విద్యార్థులతల్లిదండ్రులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

చాలాచోట్ల పునరాలోచన

ఒత్తిడి కారణంగానే తమ సిబ్బందిని అప్పగించామని పేర్కొంటూ డయాసిస్‌ ఆఫ్‌ నెల్లూరు సొసైటీ అక్టోబరు 4న పాఠశాల విద్యాశాఖ సంచాలకుడికి లేఖ రాసింది. ఈ సొసైటీకి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 34 పాఠశాలలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో 20 పాఠశాలల ద్వారా వందేళ్లుగా పేదలకు విద్యనందిస్తున్న ది రోమన్‌ క్యాథలిక్‌ డయాసిస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ డెక్కన్‌ సొసైటీ విజయవాడ తమకు ఎయిడ్‌ను కొనసాగించాలని ఈనెల 5న విద్యాశాఖను కోరింది. గుంటూరులో రోమన్‌ క్యాథలిక్‌ మిషన్‌కు 70 వరకు పాఠశాలలు ఉండగా గతంలో ఇచ్చిన సమ్మతి లేఖలను వెనక్కి తీసుకుంటామని కోరుతోంది. ఇదే జిల్లాలో మరో 12 ఎయిడెడ్‌ విద్యా సంస్థలు ఎయిడ్‌ కొనసాగించాలని అధికారులను అభ్యర్థిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో 9 యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.

ఎయిడెడ్‌ కొనసాగించాలని విశాఖపట్నంలో మొదలైన ఆందోళన తూర్పు, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాలకు పాకింది. రాష్ట్రంలో తొలిసారిగా అక్టోబరు 25న విశాఖలోని సేక్రెడ్‌ప్ హార్ట్‌ ఎయిడెడ్‌ బాలికల ఉన్నత పాఠశాల తల్లిదండ్రులు ఆరు గంటలపాటు బైఠాయించగా అధికారులు దిగొచ్చారు. అనంతరం 26న కాకినాడలోనూ తల్లిదండ్రులు రోడ్డెక్కారు. జగన్నాథపురంలోని సెయింట్‌ ఆన్స్‌ ఎయిడెడ్‌ బాలికల ఉన్నత పాఠశాలకు గ్రాంట్‌ను కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. భీమవరంలోని ఎస్‌సీహెచ్‌బీఆర్‌ఎం పాఠశాలను ఎయిడెడ్‌గానే కొనసాగించాలని 28, 29న రెండు రోజులపాటు నిరసనలు తెలిపారు. విశాఖనగరం టీపీటీ కాలనీలోని వసంతబాల విద్యోదయ, చిత్తూరు జిల్లా నిండ్ర మండలం శ్రీరామాపురం పాఠశాలలకు గ్రాంట్‌ను కొనసాగించాలని 29న తల్లిదండ్రులు, గ్రామస్థులు గళమెత్తారు.

‘‘ఒత్తిడితోనే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించాం. సమ్మతి తెలపని వాటికి గ్రాంట్‌ని కొనసాగిస్తామని హైకోర్టుకు ప్రభుత్వం హామీ ఇచ్చినందున… పోస్టులను అప్పగిస్తూ గతంలో ఇచ్చిన అంగీకార పత్రాన్ని వెనక్కి తీసుకుంటాం’’

– పాఠశాల విద్యాశాఖ సంచాలకుడికి డయాసిస్‌ ఆఫ్‌ నెల్లూరు సొసైటీ లేఖ

‘‘కృష్ణా జిల్లాలో 1917 నుంచి ఎయిడెడ్‌ పాఠశాలలతో అక్షరాస్యత పెంపుదలకు విశేషంగా కృషి చేస్తున్నాం. మేం    నిర్వహించలేక బోధన, బోధనేతర సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించలేదు. తీవ్ర ఒత్తిడి, భయంతోనే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ అప్పగిస్తూ లేఖ ఇచ్చాం’’

– ది రోమన్‌ క్యాథలిక్‌ డయాసిస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ డెక్కన్‌ సొసైటీ విజయవాడ లేఖ

మొత్తంగా ఇదీ పరిస్థితి…

రాష్ట్రంలో ఎయిడెడ్‌లో 2,249 డిగ్రీ, జూనియర్‌, పాలిటెక్నిక్‌, పాఠశాలలు ఉండగా… వీటిలో 64% యాజమాన్యాలు కేవలం సిబ్బందిని వెనక్కి ఇచ్చేందుకు సమ్మతి తెలిపాయి. వంద సంస్థలు ఆస్తులతో సహా ప్రభుత్వానికి అప్పగిస్తామన్నాయి. 703 సియాజమాన్యాలు ఎలాంటి అంగీకారం తెలపలేదు.

West Godavari RCM Unwilling Letter


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this