MLC Elections: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మళ్లీ మోగిన...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

MLC Elections: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మళ్లీ మోగిన ఎన్నికల నగారా.. ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Andhra Pradesh-Telangana MLC Elections: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మళ్లీ ఎన్నికల నగారా మోగింది. ఈసారి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానికలకు ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఎమ్మెల్యే కోటా కింద తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌లో 3 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి సంబంధించిన షెడ్యూల్‌ నోటిఫికేషన్ జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 29న పోలింగ్, కౌటింగ్ నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కాగా, ఎన్నికల నిర్వహణకు సంబంధించి నవంబర్ 9న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి 16వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 17వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు. 22న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. 29వ తేదీన పోలింగ్ నిర్వహించి, అదే రోజు కౌంటింగ్ కూడా నిర్వహిస్తారు.

అయితే, తెలంగాణలో ఆకుల లలిత, మహ్మద్‌ ఫరూద్దీన్‌, గుత్తా సుఖేందర్‌ రెడ్డి, నేతి విద్యాసాగర్‌, వెంకేటశ్వర్లు, కడియం శ్రీహరి పదవీకాలం జూన్‌ 3 వ తేదీ నాటికే ముగిసింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో సోము వీర్రాజు, చిన్న గోవిందరెడ్డి, మహ్మద్‌ షరీఫ్‌ పదవీకాలం మే 31వ తేదీ నాటికి ముగిసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా, తాజా నోటిఫికేషన్‌తో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఆశావహ నేతలు ఇప్పటికే మంతనాలు మొదలుపెట్టారు. మరి ఇరు రాష్ట్రాల్లో ఎవరికి ఛాన్స్ లభిస్తుంది? ప్రస్తుతం ఉన్న వాళ్లకే రెన్యూవల్ చేస్తారా? కొత్తవారికి అవకాశం ఇస్తారా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this