Monday, February 23, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
GST: భారతదేశంలో జీఎస్టీలో మూడు రకాలు.. సీజీఎస్టీ,...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

GST: భారతదేశంలో జీఎస్టీలో మూడు రకాలు.. సీజీఎస్టీ, స్టేట్‌జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ.. వీటి అర్థాలు ఏంటంటే..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 GST: జీఎస్టీ.. ఈ పదం దాదాపు అందరికి తెలిసిందే. కేంద్ర సర్కార్‌ 2016 నవంబర్‌లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత జీఎస్టీ అనే పదం గురించి ఎక్కువ చర్చించడం జరుగుతోంది. 

జీఎస్టీ (GST) అంటే వస్తువుల మరియు సేవా పన్ను. అయితే కేంద్ర ప్రభుత్వం నోట్లను రద్దు చేసిన తర్వాత జూలై 2017 నుంచి ప్రభుత్వం జీఎస్టీని అమలు చేసింది. ఒక వస్తువును కొనుగోలు చేసినప్పుడు లేదా ఒక సేవను పొందినప్పుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీ వన్‌ నేషన్‌ వన్‌ ట్యాక్స్‌ వ్యవస్థ కింద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా వస్తువు లేదా సేవలపై ఈ పన్ను రేటు దేశ వ్యాప్తంగా ఒకే విధంగా ఉంటుంది. అంటే దేశంలోని ఏ ప్రాంతంలోనైనా కస్టమర్‌ ఆ వస్తువులు లేదా సేవలపై ఒకే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

జీఎస్టీ మూడు రకాలు:

జీఎస్టీని మూడు రకాలుగా విభజించారు. సెంట్రల్‌ జీఎస్టీ (CGST), రాష్ట్ర జీఎస్టీ (SGST), ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ (IGST). అయితే ఈ మూడు రకాల జీఎస్టీల అర్థాలు ఏమిటో తెలుసుకుందాం.

సెంట్రల్‌ జీఎస్టీ (CGST) అంటే ఏమిటి?

CGST (సెంట్రల్‌ జీఎస్టీ) అంటే కేంద్ర వస్తువులు మరియు సేవా పన్ను. అంటే రాష్ట్రంలో ఏదైనా వస్తువుల సరఫరా లేదా సేవలు పొందినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించే పన్నును సీజీఎస్టీ (CGST) అంటారు. ఒక వ్యాపారవేత్త తన రాష్ట్రంలో మరొక వ్యాపారి నుంచి వస్తువులను తీసుకోవడం లేదా ఇతర సేవలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఈ జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది.

స్టేట్‌ జీఎస్టీ (SGST) అంటే ఏమిటి?

స్టేట్‌ జీఎస్టీ (SGST) అంటే రాష్ట్ర వస్తువులు మరియు సేవా పన్ను అని అర్థం. రాష్ట్రంలో ఏదైనా వస్తువులు సరఫరా చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లే పన్నును రాష్ట్ర జీఎస్టీ అంటారు. ఒక వ్యాపారి తన సొంత రాష్ట్రంలోని మరొక వ్యాపారి నుంచి ఏదైనా వస్తువులు దిగుమతి చేసుకున్నప్పుడు ఈ లావాదేవీలపై రాష్ట్ర ప్రభుత్వానికి సీజీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

ఐజీఎస్టీ (IGST) అంటే ఏమిటి?

ఐజీఎస్టీ (IGST) అంటే ఇంటిగ్రేటెడ్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ టాక్స్‌ (Integrated Goods and Services Tax-IGST). సమగ్ర వస్తుసేవల పన్ను అని అర్థం. అంటే అంతరాష్ట్ర (రాష్ట్రాల మధ్య) వ్యాపారం లేదా వాణిజ్యంలో భాగంగా వస్తువులు, సేవల సరఫరాపై ఐజీఎస్టీ చట్టం కింద విధించే పన్ను. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్‌ వాటాను కలిగి ఉంటుంది. రాష్ట్రాల వాటాను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వబడుతుంది. ఐజీఎస్టీ సేకరించే హక్కు కేంద్రానికి మాత్రమే ఉంటుంది. కేంద్ర, రాష్ట్రం రెండూ మరొక దేశం నుంచి ఉత్పత్తులు లేదా సేవలపై పన్ను పొందుతాయి.

ఐటీఆర్‌ రిటర్న్‌..

అయితే కొత్త నిబంధనల ప్రకారం.. జీఎస్టీ వ్యవస్థలో వ్యాపారుల వ్యాపారంపై పర్యవేక్షణ ఉంటుంది. ప్రతి నెలా మొత్తం అమ్మకాలు, కొనుగోళ్లు, పన్నులు తదతర వివరాలు ప్రభుత్వానికి చేరుతాయి. ఈ వివరాలన్ని ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. ఇది జీఎస్టీ రిటర్న్‌ వ్యవస్థ. వ్యాపారం సరిగ్గా లేకపోవడంపై డిపాజిట్‌ చేసిన పన్నులు క్రెడిట్‌ల రూపంలో వ్యాపారులకు తిరిగి చెల్లించడం జరుగుతుంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this