Employee Demands: పీఆర్సీపై నోరు విప్పాలి!

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Employee Demands: పీఆర్సీపై నోరు విప్పాలి!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • సంఘాల ప్రకటన .. ‘సర్కారు క్రీడ
  • రాజీనా? పోరాటమా? అన్నది తేలాలి 
  • ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌రావు ఆగ్రహం
  • డిసెంబరు తర్వాత ఉద్యమ కార్యాచరణ

పీఆర్సీపై ప్రభుత్వం ఇప్పటికైనా నోరు విప్పాలని, ఉద్యోగుల్లో నెలకొన్న అయోమయం తొలగించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్రప్రధాన కార్యదర్శి ఆస్కార్‌రావు డిమాండ్‌ చేశారు. ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత ఉద్యోగ సంఘాల పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో తమ సంఘానికి సంబంధం లేదని తెలిపారు. ఈ సంఘాల ప్రకటనలు ప్రభుత్వ క్రీడలో భాగమేనని విమర్శించారు. ‘పీఆర్సీపై ముఖ్యమంత్రి తేల్చేస్తార’న్న ఒక సంఘం నాయకుని ప్రకటనపై ఉద్యోగులకు నమ్మకం లేదని.. పరోక్షంగా ఏపీజీఈఎఫ్‌ చైర్మన్‌ కాకర్ల వెంకట్రామిరెడ్డి తీరును విమర్శించారు. 11వ పీఆర్సీ కమిషనర్‌ అసుతోష్‌ మిశ్రా కేవలం 23ు ఫిట్మెంట్‌ మాత్రమే ప్రకటించారని, ప్రభుత్వం అంతకంటే ఎక్కువగా 27ు ఐఆర్‌ అమలు చేస్తున్నందున దాన్నే ఫిట్మెంట్‌ అనుకోవచ్చని సీఎస్‌ గత నెల 29న జరిగిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో స్పష్టం చేశారని తెలిపారు. ‘‘ఇంత జరిగినప్పటికీ ఉద్యోగ సంఘాలకు నాటకాలెందుకు? ఆ సమావేశంలో వారు లేరా?’’ అని ఆస్కార్‌ రావు ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంతో రాజీనా? పోరాటమా? అన్నది ఉద్యోగులు తేల్చుకోవాలన్నారు.  తమ సంఘం ముందుగా ప్రకటించినట్టు ప్రభుత్వానికి డిసెంబరు 31 వరకు సమయం ఇస్తున్నామన్నా రు. ఆ తర్వాత ప్రణాళికా బద్ధంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this