Weather Alert - Rain Warning: ఏపీకి...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

Weather Alert – Rain Warning: ఏపీకి మరో ముప్పు.. దూసుకొస్తున్న తుఫాన్‌.. వాతావరణశాఖ అలర్ట్‌.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 AP Rain Alert: ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాలతో ఏపీలోని రాయలసీమ, కోస్తాఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో ఏర్పడిన మరో అల్పపీడనం మళ్లీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. దీని ప్రభావంతో ఏపీలో మళ్లీ మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్య అండమాన్ సముద్రం మరియు దాని ఆనుకొని ఉన్న ప్రాంతాల మీద ఉన్న అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం, మధ్య ట్రోపోస్పియర్ వరకు విస్తరించిఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి గురువారం డిసెంబర్ 2వ తేదీ నాటికి వాయుగుండంగా మారనుంది. ఇది మరింత బలపడి తదుపరి 24 గంటలలో మధ్య బంగాళాఖాతంలో తుపాన్‌గా మారనుంది. తరువాత వాయువ్య దిశలో ప్రయాణించి మరింత బలపడుతూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిస్సా తీరానికి డిసెంబర్ 4వ తేదీ నాటికి చేరే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను ఒకసారి చూద్దాం.

ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం: ఈరోజు ఉత్తర కోస్తాంధ్రాలో వాతావరణం పొడిగా ఉంటుంది. రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this