Cyclone Holiday: తుఫాను కారణంగా తూ.గో జిల్లాలో...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Cyclone Holiday: తుఫాను కారణంగా తూ.గో జిల్లాలో ఒక రోజు శలవు ప్రకటించిన జిల్లా కలక్టర్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 పత్రికాప్రకటన కాకినాడ, 2.12.2021

  • తుఫాను హెచ్చరిక నేపద్యంలో జిల్లా యంత్రాంగం, ప్రజలు అప్రమత్తం కావాలి– జిల్లా కలెక్టర్. 
  • జిల్లా, డివిజన్ కేంద్ర కంట్రోల్ రూమ్ ల ద్వారా నిరంతర పర్యవేక్షణ, 
  • రక్షణ, సహాయ శాఖల అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు.
  • ముందు జాగ్రత్తగా ఈ నెల 4వ తేదీన జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలలకు లోకల్ హాలీడే ప్రకటిస్తూ ఉత్తర్వుల జారీ

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా  రానున్న మూడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురియనున్నాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరిక నేపద్యంలో  జిల్లా యంత్రాంగం, ప్రజలు ముందు జాగ్రత్తలతో అప్రమత్తం కావాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ కోరారు.

మధ్య అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫానుగా బలపడి వాయువ్య దిశలో కదులుతూ ఈ నెల 4వ తేదీ ఉదయానికి ఉత్తరాంధ్ర-ఒడిస్సా తీరాన్ని తాకనుందని, దీని ప్రభావం వల్ల డిశంబరు 3 నుండి 5వ తేదీ వరకూ తూర్పు గోదావరి జిల్లాలో బలమైన గాలులతో భారీ వర్షపాతం నమోదు కానుందని వాతావరణ  హెచ్చరిక జారీ అయిందని ఆయన తెలిపారు.                                    

తుఫాను హెచ్చరిక నేపద్యంలో మత్స్యకారులు ఎవ్వరూ సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించాలని, ఇప్పటికే సముద్రంలో ఉన్న వారిని వెంటనే తీరానికి చేరుకునేలా చర్యలు చేపట్టాలని మత్య్సశాఖ అధికారులను ఆదేశించారు.  పెనుగాలుల వల్ల ప్రమాదాలు సంభవించకుండా  పూరిళ్లు, తాటాకు, పెంకుటిల్లలో నివశిస్తున్నవారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆయన కోరారు. అలాగే వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల క్రింద ఉండవద్దని హెచ్చరించారు. రానున్న 2,3 రోజులలో భారీ వర్షాల వల్ల ఏజెన్సీ ప్రాంతంలోని వాగులు, వంకలు పొంగి పొర్లే ప్రమాదం ఉందని, కావున ప్రసవ తేదీకి దగ్గరలో ఉన్న గర్భవతులందరినీ సమీప ప్రభుత్వ ఆసుపత్రులలోని ప్రసవ నిరీక్షణ గదులకు తరలించాలన్నారు. గంటకు 80 కి.మీ. వేగంతో తుఫాను ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున, చెట్లు విద్యుత్ స్థంబాలు కూలి రహదార్లకు అంతరాయం ఏర్పడే అవకాశం దృష్ట్యా ప్రజలు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు.

రవాణా అవరోధాలను తొలగించేందుకు అవసరమైన జెసిబిలు, పవర్ కట్టర్లు, రంపాలు, ట్రాక్టర్లను సిద్దంగా ఉంచాలని ఆయన అధికారులకు సూచించారు. విద్యుత్ అంతరాయాల వల్ల త్రాగునీటి సరఫరాకు ఆటంకం కలుగకుండా జనరేటర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కమ్యూనికేషన్ వ్యవస్థలు అన్ని ఎటువంటి  అంతరాయం లేకుండా సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు.   రెవెన్యూ, అగ్నిమాపక, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, పంచాయితీరాజ్, రోడ్లు భవనాలు, పోలీస్ తదితర రక్షణ,సహాయ శాఖలకు సెలవులు రద్దు చేసి, అధికారులు, సిబ్బంది అత్యవసర విధులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. తుఫాను హెచ్చరికలను మీడియా, వలంటీర్ల వ్యవస్థ, టాంటాం ద్వారా ప్రజలకు ఎప్పటి కప్పుడూ తెలియజేయాలని, మండల ప్రత్యేక అధికారులు తమతమ మండల కేంద్రాలలో ఉండి ముందస్తు జాగ్రత్తలను, సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ముందు జాగ్రత్తగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలకు ఈ నెల 4వ తేదీన స్థానిక శెలవు దినం ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  కలెక్టరేటులోను, అన్ని డివిజన్ కేంద్రాలలోనూ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని తుఫాను పరిస్థితులపై ఎప్పటికప్పుడు తనకు, కంట్రోల్ రూమ్ కు సమాచారం తెలియజేయాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందకు  ప్రమాణిక విపత్తు నియంత్రణ కార్యాచరణలను పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కంట్రోల్ రూమ్ నంబర్లుః

1. జిల్లా కలెక్టరు కార్యాలయం, కాకినాడ 1800-425-3077

2. ఆర్డిఓ, కాకినాడ కార్యాలయం 0884-2368100

3. ఆర్డిఓ, అమలాపురం కార్యాలయం 08856-233208

4. ఆర్డిఓ, రామచంద్రపురం కార్యాలయం 08857-245166

5. ఆర్డిఓ, పెద్దాపురం కార్యాలయం 9603663227

6. పిఓ.ఐటిడిఏ, రంపచోడవరం కార్యాలయం 1800-425-2123

7. సబ్ కలెక్టర్, రంపచోడవరం కార్యాలయం 08864-243561

8. సబ్ కలెక్టర్, రాజమండ్రి కార్యాలయం 0883-2442344

9. ఆర్డిఓ, ఎటపాక కార్యాలయం 08864-285999, 7331179044


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this