Horoscope Today: ఆర్థిక లావాదేవీల విషయంలో వారు...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Horoscope Today: ఆర్థిక లావాదేవీల విషయంలో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

దిన ఫలాలు (నవంబర్ 21, 2023): మేష రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు, పనులన్నీ వేగంగా, చురుకుగా పూర్తవుతాయి. ఏ ప్రయత్నమైనా నెరవేరే అవకాశం ఉంటుంది. వృషభ రాశికి చెందిన మీ సలహాలు, సూచనలు అధికారులకు బాగా ఉపయోగపడతాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మిథున రాశికి చెందిన వారికి ఇంటా బయటా ఒత్తిడి ఉన్నప్పటికీ, మొత్తం మీద రోజంతా సంతృప్తికరంగా సాగిపోతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

horoscope today: ఆర్థిక లావాదేవీల విషయంలో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు..
దిన ఫలాలు (నవంబర్ 21, 2023): మేష రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు, పనులన్నీ వేగంగా, చురుకుగా పూర్తవుతాయి. ఏ ప్రయత్నమైనా నెరవేరే అవకాశం ఉంటుంది. వృషభ రాశికి చెందిన మీ సలహాలు, సూచనలు అధికారులకు బాగా ఉపయోగపడతాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మిథున రాశికి చెందిన వారికి ఇంటా బయటా ఒత్తిడి ఉన్నప్పటికీ, మొత్తం మీద రోజంతా సంతృప్తికరంగా సాగిపోతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ముఖ్యమైన వ్యవహారాలు, పనులన్నీ వేగంగా, చురుకుగా పూర్తవుతాయి. ఏ ప్రయత్నమైనా నెరవేరే అవకాశం ఉంటుంది. మొత్తం మీద సమయం బాగా అనుకూలంగా ఉంది. అందువల్ల సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఉద్యోగంలో విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలను మించిన రాబడి లభిస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. కొందరు మిత్రుల విషయంలో అప్రమత్తంగా ఉండక తప్పదు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

అధికారులకు మీ సలహాలు, సూచనలు బాగా ఉపయోగపడతాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సమాజంలో మీ మాటకు, చేతకు తిరుగుండదు. మంచి పరిచయాలు ఏర్పడ తాయి. ఉద్యోగంలో పురోగతి సాధించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సంపాదన సంతృప్తి కరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. సంతానానికి సంబంధించి శుభ వార్త వింటారు. కుటుంబంతో కలిసి విహార యాత్ర చేస్తారు. కొన్ని దైవ కార్యాల్లో పాల్గొంటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఇంటా బయటా ఒత్తిడి ఉన్నప్పటికీ, మొత్తం మీద రోజంతా సంతృప్తికరంగా సాగిపోతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం అందివస్తుంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు నెరవేరుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహకారం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలు న్నాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కొందరు మిత్రుల కారణంగా కూడా సమస్యలు తలెత్తుతాయి. వ్యాపారాల మీద మరింతగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటాయి. వృథా ఖర్చుల్ని అదుపు చేయడం మంచిది. కుటుంబ సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే సూచనలున్నాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహా రాలు, పనులు ఇబ్బంది లేకుండా పూర్తవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవు తాయి. వృత్తి, వ్యాపారాల్లో కూడా ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలు సంతృప్తికరంగా చక్కబడతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఆచితూచి ఖర్చు చేయడం మంచిది. అనుకోని ఖర్చులు మీద పడతాయి. ఆర్థిక లావాదేవీల్లో కాస్తంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యో గంలో బాగా ఒత్తిడి, శ్రమ ఉన్నప్పటికీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో విశ్రాంతి లేని పరిస్థితి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరగకపోవచ్చు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి తీరిక ఉండని పరిస్థితి ఏర్పడు తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి శుభవార్త అందుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

కొన్ని సమస్యల పరిష్కారంలో బాగా మానసిక ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు, అదరణ లభిస్తాయి. వృత్తి, వ్యాపా రాలు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం విష యంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. పిల్లలు చదువుల్లో మంచి పురోగతి సాధిస్తారు. స్నేహితుల కార ణంగా కొద్దిగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవు తాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. దాదాపు ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది. అను కున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచ యాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, వ్యాపారాల్లో కొత్త వ్యూహాలు, కొత్త కార్యక్రమాలు ప్రవేశపెడతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగంలో బాగా పని ఒత్తిడి ఉంటుంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపో తుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. నిరుద్యోగులు ఆశించిన శుభవార్త అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమ, తిప్పట ఉండవచ్చు. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

కుటుంబసమేతంగా ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగంలో బాగా ఒత్తిడి ఉంటుంది. మితిమీరిన ఔదార్యంతో కొందరు స్నేహితులకు సహాయం చేస్తారు. కొందరు దగ్గర బంధువులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. వ్యక్తి గత సమస్యలను సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. సతీమణి నుంచి ఆస్తి సంబంధమైన శుభ వార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. మిత్రుల తోడ్పాటుతో చిన్నా చితకా సమస్యలను పరిష్కరించుకుంటారు. చిన్ననాటి స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు, వ్యూహాలు ప్రవేశపెట్టి లబ్ధి పొందుతారు. కుటుంబ జీవితం హాయిగా గడిచిపోతుంది.

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this