Cyclone Jawad: విశాఖలో హైఅలర్ట్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Cyclone Jawad: విశాఖలో హైఅలర్ట్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మోహరింపు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

జవాద్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విశాఖపట్టణంలలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎప్ సిబ్బందిని మోహరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచించారు. ప్రజలకు టోల్ ఫ్రీ నెంబర్లను అందించారు.

విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై cyclone jawad తీవ్ర ప్రభావాన్ని చూసే అవకాశం ఉందని Imd శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విశాఖపట్టణంలో రెస్క్యూ సిబ్బందిని అందుబాటులో ఉంచారు.మూడు Ndrfబృందాలతో పాటు 45 మందితో Sdrf సిబ్బందిని రంగంలోకి దించారు. జీవీఎంసీ పరిధిలో 21 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. Visakhapatnam జిల్లాలోని ఏడు రిజర్వాయర్లలో అత్యవసర పరిస్థితుల్లో నీటిని విడుదల చేయడానికి ఇరిగేషన్ అధికారులను సిద్దం చేశారు.Gvmc, రెవిన్యూ, పోలీస్, పంచాయితీరాజ్, రోడ్లు భవనాల శాఖాధికారులతో సమన్వయం  చేసుకొంటూ  సహాయక చర్యలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. cyclone ప్రభావంతో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటే చెట్లు విరిగిపడే ప్రమాదం ఉంది. దీంతో జేసీబీలతో పాటు చెట్లను కట్ చేసే యంత్రాలను కూడా సిద్దం చేసుకొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. విశాఖలో control  రూమ్స్ ఏర్పాటు చేశారు. 0891-2590100,0891-2590102,0891-2750090,  నెంబర్లకు ఫోన్లు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

ఉత్తరాంధ్రలోని విశాఖకు ఆగ్నేయంగా దాదాపు 516  కిలోమీటర్ల దూరంలో జవాద్ తుఫాన్ కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇది గంటకు 32 కిలోమీటర్ల వేగంతో తీరంవైపుగా కదులుతున్నట్టు IMD వెల్లడించింది. ఇవే పరిస్థితులు కొనసాగితే శనివారం(రేపు) ఉదయానికి ఇది ఉత్తర కోస్తాంధ్ర- దక్షిణ ఒడిశా పరిసరాల్లో తీరాన్ని దాటవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ తుపాను ప్రభావంతో ఇప్పటికే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశాలోని చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. అక్కడక్కడా చిరుజల్లులు కూడా ప్రారంభమయ్యాయి. తుపాను తీరానికి దగ్గరయ్యేకొద్ది వర్షతీవ్రత పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. 

విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటిపై తుఫాను ప్రభావం ఎక్కువగా వుండనుంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన విద్యాశాఖ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ యంత్రాంగమంతా ఇప్పటికే అప్రమత్తమై ప్రమాదం పొంచివున్న ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలోపడ్డారు.  ఇక ఉభయగోదావరి జిల్లాలకు అధికారులు తుపాను ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. తుపాను దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా, డివిజన్‌ కేంద్ర కంట్రోల్‌ రూమ్‌ల ద్వారా పర్యవేక్షించనున్నారు. రక్షణ, సహాయశాఖల అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.ఇవాళ సాయంత్రం నుంచే ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలతోపాటు తీరంవెంబడి గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ గాలుల ధాటికి విద్యుత్తు స్తంభాలు, చెట్లు కూలిపోయే ప్రమాదంతో పాటు వర్షపునీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదముంది కాబట్టి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.  

cyclone jawad: విశాఖలో హైఅలర్ట్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మోహరింపు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this