Indian Navy Operation:నేవీ డే.. ‘ఆపరేషన్ ట్రైండెట్‌’తో...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Indian Navy Operation:నేవీ డే.. ‘ఆపరేషన్ ట్రైండెట్‌’తో పాక్‌ను చావుదెబ్బ కొట్టిన భారత నౌకాదళం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

భారత రక్షణ విభాగంలోని త్రివిధ దళాల్లో నావికా దళానిది కీలక పాత్ర. ఇండియన్ నేవీ సాధించిన విజయాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబరు 4న నేవీ డే జరుపుకుంటాం

  • పాకిస్థాన్ పీచమణిచిన భారత నౌకాదళం.
  • బంగ్లా ముక్తి పోరాటంలో దాయాదికి చావుదెబ్బ.
  • కరాచీ పోర్టుపై మెరుపుదాడితో షాకైన పాకిస్థాన్.
బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో భాగంగా దాయాది పాకిస్థాన్‌తో 1971లో జరిగిన యుద్ధంలో డిసెంబరు 4న భారత నౌకాదళం అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ కరాచీ పోర్టుపై మెరుపుదాడిచేసి వారి యుద్ధ నౌకలను ధ్వంసం చేసింది. దీంతో బంగాళాఖాతంలోని పాక్ ప్రాదేశిక జలాలు భారత్ స్వాధీనంలోకి వచ్చాయి. మరోవైపు, వాయుసేన సైతం పాక్ వైమానిక స్థావరాలపై దాడిచేసి కకావికలం చేసింది. ఈ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబరు 4న నేవీ డే జరుపుకుంటున్నారు. ఈ రోజునే నేవీ డేగా దేశంలోని నావికాదళ కమాండ్స్‌ నిర్వహిస్తున్నాయి.

రక్షణ దళంలోని త్రివిధ దళాలు అత్యంత ఘనకీర్తిని ఇనుమడింపజేసే కార్యక్రమాలతో ఈ రోజు ఉత్సవాలను నిర్వహిస్తారు. తీరప్రాంత భద్రతలో నేవీ పాత్ర అత్యంత కీలకంగా మారింది. తీర సరిహద్దులను రక్షించడం, అంతర్జాతీయ సంబంధాలను విస్తరింపజేయడం, సంయుక్త సైనిక విన్యాసాల నిర్వహణ, ప్రకృతి విపత్తులు, ఇతర ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవడానికి మానవతా దృక్పథంతో కూడిన నౌకాదళ సేవలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. నేవీ డే విజయానికి గుర్తుగా నేవీ బ్యాండ్‌ బృందాల సాంస్కృతిక ఉత్సవాలు కూడా ఏటా ఘనంగా విశాఖ ఆర్కే బీచ్‌లో నిర్వహిస్తుంటారు.

1971 డిసెంబర్‌ 4 న అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారత నావికాదళం పాకిస్తాన్‌లోని కరాచీ పోర్టుపైన మెరుపుదాడి చేసింది. నాలుగు యుద్ధ నౌకలను ధ్వంసం చేసి, బంగాళాఖాతంలో ప్రాదేశిక ప్రాంతాలను నేవీ తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. మరోవైపు భారత వైమానిక దళం దాదాపు 4000 యుద్ధ వాహనాలతో పాకిస్తాన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ను కలావికలం చేసింది. భారత సైన్యం ముందు పాక్‌ ఎత్తులు నిలవలేక 15 రోజుల్లోనే డిసెంబర్‌ 16 న పూర్తిగా భారత దళాలకు లొంగిపోయింది.

ఈ యుద్ధంలో పాకిస్తాన్‌ జలాంతర్గామి ఘాజీని తూర్పునౌకాదళం విశాఖ సమీపంలో ముంచేసింది. భారత ఉపఖండానికి చెందిన సముద్ర జలాలలో మొదటి జలాంతర్గామి వినాశనం ఇదే తొలిసారి. ఆపరేషన్‌ ట్రైడెంట్‌ పేరుతో భారత నౌకాదళం చేపట్టిన కరాచీ రేవుపై దాడి విజయవంతమైంది. ఈ క్రమంలోనే డిసెంబర్‌ 4 – 5 రాత్రి పాకిస్తానీ డిస్ట్రోయర్‌ నౌకలు దెబ్బతిని సముద్రంలోనే నాలుగు మునిగిపోయాయి. ఇవి భారత నావికాదళ వ్యూహాత్మక విజయానికి తార్కాణంగా నిలిచాయి. 720 మంది పాక్ నేవీ సైన్యం చనిపోగా, దాయాదికి అపార వాణిజ్య నష్టం కలిగింది.
అదే క్రమంలో భారత్‌ వైపున ప్రాణనష్టం భారీగానే జరిగింది. అరేబియా మహా సముద్రంలో భారత్‌ ఫ్రిగేడ్‌ ఐఎన్‌ఎస్‌ ఖుక్రీను ముంచివేసినప్పుడు 18 మంది అధికారులు, 176 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధంలో భారత నౌకాదళానికి జరిగిన అతిపెద్ద నష్టం ఇదే. పాకిస్తాన్‌ మాత్రం తన మూడో వంతు నావికాదళ సైన్యాన్ని కోల్పోయింది. పాకిస్థాన్‌కు చెందిన యుద్ధ ఖైదీలు సుమారు 90 వేల మంది పట్టుబడగా, ఇండియన్‌ నేవీకి చెందిన ఐఎన్‌ఎస్‌ నిర్ఘాట్‌, ఐఎన్‌ఎస్‌ వీర్‌, ఐఎన్‌ఎస్‌ నిపాట్‌ ఈ ఆపరేషన్స్‌లో కీలకపాత్ర పోషించాయి.

తూర్పు పాకిస్థాన్ (బంగ్లాదేశ్)ను పశ్చిమ పాక్ పాలకులు చిన్నచూపుచూడటం.. ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన అవామీ లీగ్ నేత ముజిబూర్ రెహమాన్‌కి అధికారం అప్పగించకుండా సైనిక ప్రభుత్వం అరెస్ట్ చేయడం.. దీనిపై నిరసన తెలిపిన ప్రజల మీద ఉక్కుపాదం మోపి అణచివేతకు గురి చేయడంతో తిరుగుబాటు మొదలయ్యింది. ముక్తివాహిని పేరిట గెరిల్లా పోరాటానికి దిగారు. అప్పుడు సైన్యం తన అరాచకాన్ని మరింత పెంచడంతో వేలాది మంది శరణార్ధులుగా భారత్‌లో ప్రవేశించసాగారు.

అప్పటివరకూ ముక్తివాహిని దళాలకు ఆయుధ సహాయం చేస్తూ వచ్చిన భారత్ నేరుగా యుద్ధంలోకి దిగాల్సి వచ్చింది. తూర్పు, పశ్చిమ సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించి యుద్ధంలో పాక్‌ను చావుదెబ్బకొట్టింది. నాటి ప్రధాని ఇందిరా గాంధీ సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడంతో దాయాదిపై ఏమాత్రం నిలువలేకపోయింది.
భారత సైన్యం పదిహేను వేల చదరపు కిలోమీటర్ల పాక్ భుభాగాన్ని చేజిక్కించుకుని, మరుసటి సంవత్సరం తిరిగి ఇచ్చింది.

indian navy operation:నేవీ డే.. ‘ఆపరేషన్ ట్రైండెట్‌’తో పాక్‌ను చావుదెబ్బ కొట్టిన భారత నౌకాదళం.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this