Omicron Virus: భారత్‏లో ఒమిక్రాన్ టెన్షన్.. పిల్లల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Omicron Virus: భారత్‏లో ఒమిక్రాన్ టెన్షన్.. పిల్లల పై తీవ్ర ప్రభావం.. ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 దేశంలో ఒమిక్రాన్ టెన్షన్ మొదలైంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వైరస్ వ్యాప్తి ఏలా ఉండబోతుందని ప్రపంచవ్యాప్తంగా కలవరం మొదలైంది. కరోనా వ్యాప్తిపై ఇప్పుడు యావత్ ప్రపంచం భయాందోళనకు గురవుతుంది. ఈ సమయంలో చిన్నారుల్లో కొవిడ్ ఇన్ఫెక్షన్లు పెరగడంపై దక్షిణాఫ్రికాకు చెందిన వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒమిక్రాన్‌ డేంజర్‌ కాదు. కానీ ఊసరవెల్లిలా రంగులు మారుస్తోంది. ఐదేళ్ల వయసులోపు పిల్లలపై.. 10 నుంచి 14 ఏళ్ల పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. డెల్టా + ఒమిక్రాన్‌–సూపర్‌ స్ట్రెయిన్‌ కలిస్తే ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో 40 ఏళ్లు దాటిన వారికీ బూస్టర్‌ డోసు వేసుకోవాలని నిపుణులు సూచిస్తారు. ఈ సమయంలో అమెరికా ప్రయాణలపై ఆంక్షాలు విధించింది కేంద్రం.

పిల్లల నుంచి 40 ఏళ్ల లోపు వ్యక్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న ఈ ఒమిక్రాన్ వైరస్ రాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నేచురల్ ఇమ్యూనిటీతోపాటు.. టీకాలతో రక్షణగా ఉండవచ్చని అంటున్నారు నిపుణులు. అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని చెబుతుంది కేంద్రం. ప్రతి ఒక్కరి మాస్కులు పెట్టుకోని.. ఫిజికల్​ డిస్టెన్స్ పాటించాలి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్… డెల్టా వేరియంట్ వ్యాప్తి వల్ల చాలా మందికి యాంటీబాడీలు ఏర్పడ్డాయి.

వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసినందున కొత్త వేరియంట్ ఎఫెక్ట్ పెద్దగా ఉండకపోవచ్చని అంటున్నారు. దేశంలో 40 ఏళ్లు ఆపై వయసున్నోళ్లకు బూస్టర్ డోస్ టీకాలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి ఇండియన్ సార్స్- కరోనా వైరస్ 2 జీనోమిక్స్ కన్సార్షియం(ఇన్సాకాగ్) సిఫార్సు చేసింది.

సౌత్​ ఆఫ్రికాతో పాటు ఇతర దేశాల్లోనూ ఒమిక్రాన్ కేసులు.. మరిన్ని దేశాలకూ విస్తరించే అవకాశం ఉంది. ఇటు భారత్ లోనూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి టీకానే మార్గామని.. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కేంద్రం విజ్ఞప్తి చేస్తుంది. ప్రస్తుతమున్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్ ను అడ్డుకోలేవని చెప్పడానికి ఎలాంటి ఎవిడెన్స్ లేదని.. డెల్టా వేరియంట్ కట్టడికి తీసుకున్న చర్యలనే ఒమిక్రాన్ కట్టడి కోసం తీసుకోవాలన్న డబ్ల్యూహెచ్​వో తెలిపింది. పిల్లలకు టీకాపై పరిశీలన చేయడం.. ఒమిక్రాన్ కేసులను గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ ముఖ్యమని కేంద్రం భావిస్తోంది. అలాగే విదేశీ ప్రయాణికులపై నిఘా పెట్టాలని.. దేశంలో కరోనా టెస్టుల సంఖ్య వేగవంతం చేసి.. కాంటాక్ట్ ట్రేసింగ్ చేయాలని యోచిస్తోంది. 12 నుంచి 17 ఏళ్ల పిల్లలకు టీకా ఇచ్చే విషయం గురించి సైంటిఫిక్ ఎవిడెన్స్ లను నిపుణులు పరిశీలిస్తున్నారని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు.

omicron virus: భారత్‏లో ఒమిక్రాన్ టెన్షన్.. పిల్లల పై తీవ్ర ప్రభావం.. ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా..

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this