Bheemla Nayak: 'భీమ్లా నాయక్‌': ‘అడవి తల్లి’...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్‌’: ‘అడవి తల్లి’ పాట పాడిన ఫోక్ సింగర్ కుమ్మరి దుర్గవ్వను చూశారా..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘భీమ్లా నాయక్‌’. తాజాగా ఈ సినిమా నుంచి ‘అడవి తల్లి’ అనే పాట విడుదలై రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబడుతూ ట్రెండ్ అవుతోంది. ఈ పాట పాడిన ఆ కొత్త గొంతు ఎవరిదా ..అని అందరూ ఆరా తీస్తున్నారు. థమన్ సంగీతం అందించిన ఈ పాటకు ప్రముఖ లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. సాహితి చాగంటితో పాటు కుమ్మరి దుర్గవ్వ ఈ పాటను పాడారు. ఇద్దరు హీరోల పాత్రలను తెలిపేలా ఉన్న ఈ పాట ఇప్పుడు విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ పాట పాడిన ఫోక్ సినిగర్ కుమ్మరి దుర్గవ్వ మంచిర్యాల జిల్లాకు చెందినది. ఆమె చదువుకోలేదు. అయినా తెలుగుతో పాటు మరాఠీలోనూ ఎన్నో పాటలు పాడారు. దుర్గవ్వ పాడిన ‘ఉంగురమే రంగైనా రాములాల టుంగురమే’, ‘సిరిసిల్లా చిన్నది’ వంటి పాటలు మంచి పాపులర్ అయ్యాయి. ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ సినిమాలోని ‘అడవి తల్లి’ పాటతో దేశవ్యాప్తంగా అందరికీ ఆమె టాలెంట్ తెలిసింది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఇందులో హీరోయిన్స్‌గా నిత్యా మీనన్, సంయుక్త మీనన్ నటించారు. జనవరి 12న భారీ స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

bheemla nayak: 'భీమ్లా నాయక్‌': ‘అడవి తల్లి’ పాట పాడిన ఫోక్ సింగర్ కుమ్మరి దుర్గవ్వను చూశారా..


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this