Self Confidence: అత‌ని ఎత్తు మూడు అడుగులే.....

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Self Confidence: అత‌ని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశ‌మంత‌..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Gattipally Shivalal | చూసే వారికే లోపం.. అనుకునేవారికి అయ్యో పాపం! కానీ, తనలోని లోపాన్ని ఏనాడూ శాపంగా భావించలేదు. పట్టుదలతో అనుకున్నది సాధించాడు శివలాల్‌. మరుగుజ్జుతనం శరీరానికే కానీ, మనసుకు కాదని నిరూపించాడు. 

పెద్దపల్లి జిల్లా మెట్‌పల్లికి చెందిన శివలాల్‌ వయసు 39 ఏండ్లు. జన్యులోపంతో ఎదుగుదల ఆగిపోయింది. అయితేనేం, మానసికంగా మాత్రం ఎంతో ఎదిగాడు. దేశంలోనే శాశ్వత కార్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ సాధించిన తొలి మరుగుజ్జుగా రికార్డు నెలకొల్పాడు. ఆ ప్రయాణం శివలాల్‌ మాటల్లోనే..

చిన్నప్పటి నుంచీ పట్టుదల ఎక్కువ. నన్ను చూసి నలుగురూ నాలుగు మాటలు అనేవారు. అవేవీ నేను పట్టించుకునేవాణ్ని కాదు. బాగా చదువుకోవాలని అనుకున్నా. డిగ్రీ వరకు కష్టపడి చదివా. బీకాం పూర్తి చేశా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ పాసైన తొలి మరుగుజ్జు నేనే. తర్వాత హైదరాబాద్‌లోని ఓ నిర్మాణ సంస్థలో అడ్మిన్‌ మేనేజర్‌గా చేరాను. ప్రస్తుతం కూకట్‌పల్లిలో ఉంటున్నా. మా ఊరికే చెందిన చిన్మయి కూడా మరుగుజ్జే. నాలాంటి వాళ్లనే పెండ్లి చేసుకోవాలనే ఆలోచనతో ఆమెను నా జీవిత భాగస్వామిగా ఎంచుకున్నా. మాకు ఒక బాబు.

బెంగళూరులో నేర్చుకున్నా..

ఎప్పుడు అవకాశం వచ్చినా నా ప్రత్యేకతను నిరూపించుకునే ప్రయత్నం చేస్తా. డ్రైవింగ్‌ నేర్చుకున్నదీ అందుకే. ఆలోచన రాగానే నగరంలోని డ్రైవింగ్‌ స్కూళ్లను సంప్రదించా. ఎవరూ అవకాశం ఇవ్వలేదు. ఇంటర్నెట్‌లో వెతికితే బెంగళూరులో ఒకతను నేర్పిస్తారని తెలిసింది. వెంటనే అక్కడికి వెళ్లి 15 రోజుల్లో డ్రైవింగ్‌ నేర్చుకున్నా. ఆయన ద్వారా హైదరాబాద్‌లో ఇస్మాయిల్‌ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. డ్రైవింగ్‌లో మరింత పట్టు సాధించిన తర్వాత రూ.6 లక్షలు పెట్టి సెకండ్‌ హ్యాండ్‌లో కారు కొన్నా. నాకు అనుగుణంగా బండికి మార్పులు చేర్పులు చేయించాను. ఆరు నెలలు కష్టపడి డ్రైవింగ్‌ మీద పట్టు సాధించాను.

లైసెన్స్‌ ఇవ్వనన్నారు

డ్రైవింగ్‌ అయితే నేర్చుకున్నా కానీ, మూడు అడుగుల ఎత్తే ఉన్నాననీ, రూల్స్‌ ప్రకారం లైసెన్స్‌ ఇవ్వడం కుదరదనీ ఆర్టీవో చెప్పారు. అప్పుడు ఒక అమ్మాయి రెండు చేతులూ లేకుండా కారు నడిపి, తనకు లైసెన్స్‌ ఇవ్వాలని కోర్టుకు వెళ్లింది. వెంటనే ఆమెకు లైసెన్సు మంజూరు చేయమంటూ న్యాయస్థానం నుంచి తీర్పు వచ్చింది. ఆ విషయం ఆర్టీవోకు చెబితే.. సరేనని లెర్నింగ్‌ ఇచ్చారు. మూడు నెలలకు డ్రైవింగ్‌ టెస్ట్‌ పెట్టి లైసెన్సు జారీ చేశారు. దేశంలో శాశ్వత డ్రైవింగ్‌ లైసెన్స్‌ సాధించిన తొలి మరుగుజ్జు నేనే అని లిమ్కాబుక్‌ వాళ్లు చెప్పేవరకు నాకూ తెలియదు. నాకు లైసెన్స్‌ వచ్చి 10 నెలలు అవుతున్నది. 2020 డిసెంబర్‌ నుంచి నేనూ అందరిలానే నా కారులో ఫ్యామిలీతో ప్రయాణిస్తున్నా. గిన్నిస్‌ రికార్డ్‌ కూడా సాధించాను. ఈ విజయాలన్నిటికీ కారణం నా పట్టుదలే. చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. ఆ వెక్కిరింతలే నాలో తపనను పెంచాయి. నాలా బాధపడుతున్న వాళ్లకు డ్రైవింగ్‌ నేర్పించాలని అనుకుంటున్నా. ముందుగా నా భార్యకు కారు నడపడం నేర్పిస్తా. దివ్యాంగులు, మరుగుజ్జుల కోసం డ్రైవింగ్‌ స్కూల్‌ పెట్టాలని నా ఆలోచన. ఈ విషయంలో ప్రభుత్వ సహకారం ఆశిస్తున్నా.
self confidence: అత‌ని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశ‌మంత‌..


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this