Omicron: భారత్‌లో ఒమిక్రాన్ తుఫాను.. రాజస్థాన్‌లో కొత్తగా...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Omicron: భారత్‌లో ఒమిక్రాన్ తుఫాను.. రాజస్థాన్‌లో కొత్తగా 9 మందికి గుర్తింపు, దేశంలో 21కి చేరిన సంఖ్య

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

భారత్‌లో ఒమిక్రాన్ తుఫాన్ (omicron) ప్రారంభమైనట్లే కనిపిస్తోంది. రాజస్ధాన్‌లో (rajasthan) కొత్తగా 9 మందిలో ఈ వేరియంట్ నిర్థారణ అయ్యింది. దీంతో ఇండియాలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 21కి చేరింది.

భారత్‌లో ఒమిక్రాన్ తుఫాన్ (omicron) ప్రారంభమైనట్లే కనిపిస్తోంది. రాజస్ధాన్‌లో (rajasthan) కొత్తగా 9 మందిలో ఈ వేరియంట్ నిర్థారణ అయ్యింది. దీంతో ఇండియాలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 21కి చేరింది. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లోని (jaipur) ఆదర్ష్‌నగర్‌కు చెందిన ఒకే కుటుంబంలోని 9మందికి ఈ రకం వేరియంట్‌ వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరంతా దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల వచ్చినట్లు తెలిపింది.

అంతకుందు మహారాష్ట్రలో (maharashtra) ఏడుగురికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్థారణ అయ్యింది. నైజీరియా నుంచి వచ్చిన మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్‌కు చెందిన ఓ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు, ఆ మహిళ సోదరుడు, అతడి ఇద్దరు కుమార్తెల్లో ఈ రకం వెలుగుచూసింది. అలాగే ఫిన్లాండ్‌ నుంచి పుణె (pune) వచ్చిన మరో వ్యక్తిలోనూ ఒమిక్రాన్ వైరస్‌ గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఒక్క మహారాష్ట్రలోనే ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 8కి చేరింది. ప్రస్తుతం రాజస్థాన్‌లో 9, మహారాష్ట్రలో 8, కర్ణాటకలో 2, ఢిల్లీ, గుజరాత్‌లలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజులోనే 17 కేసులు నమోదు కావడం దేశంలో కలకలం రేపుతోంది.

కాగా.. ఆదివారం దేశ రాజధాని న్యూఢిల్లీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. Tanzania నుండి వచ్చిన ఒకరికి ఒమిక్రాన్ సోకిందని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి Satyendar Jain చెప్పారు. ఢిల్లీలోని LNJP hospital ఆసుపత్రిలో 17 మంది కరోనాతో చేరారని ఆయన వివరించారు. ఆసుపత్రిలో చేరిన తొమ్మిది మందికి గొంతు నొప్పి, జ్వరంతో బాధపడున్నారు. వీరి నమూనాలను టెస్టింగ్ కోసం పంపినట్టుగా అధికారలు తెలిపారు. ఫలితాలు రావడానికి నాలుగైదు రోజుల సమయం పడుతుంది.
యూకే నుండి ముగ్గురు కొత్త రోగులు ఆసుపత్రుల్లో చేరారని లోక్‌నాయక్ జయప్రకాష్ ఆసుపత్రి సూపరింటెండ్త డాక్టర్ Suresh kumar చెప్పారు. Omicronకేసులు నమోదైన దేశాల నుండి సుమారు 15 మంది రోగులు ఢిల్లీలోని ఎన్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో చేరారు.Delhiలో కరోనా పాజిటివ్ రేటు 0.08 శాతం పాజిటివ్ రేటుతో 51 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో కరోనా కేసులు 14,41, 295కి చేరాయి. ఢిల్లీలో కరోనా 14.15 లక్షలకు చేరుకొన్నాయని ఢిల్లీ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

omicron: భారత్‌లో ఒమిక్రాన్ తుఫాను.. రాజస్థాన్‌లో కొత్తగా 9 మందికి గుర్తింపు, దేశంలో 21కి చేరిన సంఖ్య


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this