Balayya Talk Show: బాలకృష్ణ టాక్‌షోలో సూపర్‌...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Balayya Talk Show: బాలకృష్ణ టాక్‌షోలో సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు సందడి.. ఫోటోలు వైరల్‌..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Balayya Talk Show: తనలోని మరో ట్యాలెంట్‌ను బయటపెడుతూ నట సింహం బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్‌బీకే’ అనే షోలో వ్యాఖ్యాత వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే..

Balayya Talk Show: తనలోని మరో ట్యాలెంట్‌ను బయటపెడుతూ నట సింహం బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్‌బీకే’ అనే షోలో వ్యాఖ్యాత వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తొలి తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ప్రసారమవుతోన్న ఈ ప్రత్యేక టాక్‌షోకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్‌తో ఈ షో సంచలనం సృష్టించినట్లు ఇటీవల ‘ఆహా’ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.  బాలకృష్ణ ఓటీటీ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటి ఈ షోలో మోహన్‌బాబు, నాని తదితర హీరోలు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఇక తాజా ఎపిసోడ్‌కు సంబంధించి సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు సందడి చేశారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించి షూటింగ్‌ కూడా పూర్తయింది. బాలకృష్ణతో మహేష్‌బాబు సరదాగా గడిచిపోయింది. ఈ షోకు సంబంధించి ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. త్వరలోనే ఈ ఎపిపోడ్‌ ‘ఆహా’ ఓటీటీ వేదికగా ప్రసారం కానుంది.
అయితే బాలకృష్ణ, మహేష్‌బాబు కలిసి ఓ టాక్‌షోలో కనిపించడం ఇదే తొలిసారి. వీరిద్దరి మధ్య ఫన్‌ ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా ఉంది. ఈ టాక్‌ మొదటి ఎపిసోడ్‌లో మోహన్‌బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మీ, ఇక రెండో ఎపిసోడ్‌లో నాని, మూడో ఎపిసోడ్‌లో బ్రహ్మానందం, అనిల్‌ రావిపూడి కనిపించారు.
balayya talk show: బాలకృష్ణ టాక్‌షోలో సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు సందడి.. ఫోటోలు వైరల్‌..!


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this