IND vs NZ: వాంఖడే టెస్టులో భారత్...

AP Inter Results 2026 Today Live: Direct Links for 1st & 2nd Year Results, WhatsApp Mana Mitra Process, SMS Method

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

IND vs NZ: వాంఖడే టెస్టులో భారత్ ఘన విజయం.. కివీస్ చిత్తు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

వాంఖడే టెస్టుని నాలుగు రోజుల్లోనే టీమిండియా ముగించేసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బ్యాటింగ్‌లో తేలిపోయిన న్యూజిలాండ్‌ని ఏకంగా 372 పరుగుల తేడాతో భారత్ ఓడించేసింది.

  • వాంఖడే టెస్టులో భారత్ అలవోక విజయం
  • 540 పరుగుల ఛేదనలో న్యూజిలాండ్ 167 ఆలౌట్
  • మ్యాచ్‌లో 14 వికెట్లు పడగొట్టిన కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్
  • శతకం నమోదు చేసిన భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్
న్యూజిలాండ్‌తో ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ జట్టు 372 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 540 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా మ్యాచ్‌లో నాలుగో రోజైన సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 140/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ టీమ్ 167 పరుగులకే కుప్పకూలిపోయింది. భారత బౌలర్లలో అశ్విన్, జయంత్ యాదవ్ నాలుగేసి వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్‌కి ఒక వికెట్ దక్కింది. టామ్ బ్లండెల్ రనౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో.. రెండు టెస్టుల సిరీస్‌ని కూడా భారత్ 1-0తో దక్కించుకోగా.. కాన్పూర్ వేదికగా గత సోమవారం ముగిసిన తొలి టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే.
శుక్రవారం ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు.. తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (150: 311 బంతుల్లో 17×4, 4×6) శతకం నమోదు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో స్పిన్నర్ అజాజ్ పటేల్ 119 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టేశాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆడిన న్యూజిలాండ్ టీమ్ ఎవరూ ఊహించనిరీతిలో 62 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో ఏకంగా 9 మంది బ్యాట్స్‌మెన్‌లు సింగిల్ డిజిట్‌ స్కోరుకే పరిమితమవగా.. భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు, సిరాజ్ మూడు, అక్షర్ రెండు, జయంత్ యాదవ్ ఒక వికెట్ తీశాడు. దాంతో.. భారత్ జట్టుకీ 263 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన భారత్ 276/7తో డిక్లేర్ చేయగా.. న్యూజిలాండ్ ముందు 540 పరుగుల టార్గెట్ నిలిచింది.
ind vs nz: వాంఖడే టెస్టులో భారత్ ఘన విజయం.. కివీస్ చిత్తు


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this