RRR: ఆర్ఆర్ఆర్‌ నుంచి 'భీమ్' కొత్త పోస్టర్......

AP Inter Results 2026 Today Live: Direct Links for 1st & 2nd Year Results, WhatsApp Mana Mitra Process, SMS Method

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

RRR: ఆర్ఆర్ఆర్‌ నుంచి ‘భీమ్’ కొత్త పోస్టర్… ఇంటెన్స్ లుక్‌లో ఎన్టీఆర్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Jr.NTR Bheem poster from RRR: ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ భీమ్ పాత్రకు సంబంధించి మరో పోస్టర్‌ విడుదలైంది. తాజా పోస్టర్‌లో ఎన్టీఆర్ ఇంటెన్స్ లుక్ అభిమానులను కట్టిపడేస్తోంది.

  • ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ భీమ్ పోస్టర్
  • ఇంటెన్స్‌ లుక్‌లో కనిపిస్తున్న ఎన్టీఆర్
  • ఈ సాయంత్రం రాంచరణ్ అల్లూరి పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదల
Jr.NTR Bheem poster from RRR: ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రకు సంబంధించిన కొత్త పోస్టర్‌ (NTR as Bheem in RRR) విడుదలైంది. ఒంటిపై రక్తపు గాయాలతో ఎన్టీఆర్ లుక్ ఇంటెన్సివ్‌గా (Jr NTR new look) కనిపిస్తోంది. అడవిలో సాగే పోరాట సన్నివేశాల్లో భాగంగా ఎన్టీఆర్ ఈ లుక్‌లో కనిపించనున్నట్లు పోస్టర్‌ను బట్టి అర్థమవుతోంది. ఇక ఇదే సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన కొత్త పోస్టర్ నేటి సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రకటించింది.

దర్శక దిగ్గజం రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్ (Ramcharan Tej) హీరోలుగా ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మన్యం వీరులు కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో ఎన్టీఆర్, రాంచరణ్ నటిస్తున్నారు. హీరోయిన్లుగా ఆలియా భట్‌ , ఒలివియా మోరీస్‌, ఇతర కీలక పాత్రల్లో అజయ్ దేవగన్, శ్రీయ, సముద్రఖని నటిస్తున్నారు. ఫిక్షన్ పీరియాడికల్ డ్రామాగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి ఇరగదీసిన ‘నాటు నాటు’ సాంగ్, ఇటీవల విడుదలైన ‘జనని’ సాంగ్ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్తున్నాయి. ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌ను (RRR Updates) ఈ నెల 9న విడుదల చేయనున్నారు. వచ్చే జనవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
rrr: ఆర్ఆర్ఆర్‌ నుంచి 'భీమ్' కొత్త పోస్టర్... ఇంటెన్స్ లుక్‌లో ఎన్టీఆర్


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this