Central University: నూజివీడులో త్వరలో కేంద్రీయ విద్యాలయం...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

Central University: నూజివీడులో త్వరలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

నూజివీడులో త్వరలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. గురువారం ఆయన నూజివీడు ఎమ్మెల్యే ఎంవీ ప్రతాప్‌ అప్పారావుతో కలిసి కేంద్రీయ విద్యాలయానికి కేటాయించిన స్థలాన్ని, నిర్మాణం పూర్తయ్యే వరకు తరగతుల నిర్వహణకు ఏర్పాటు చేసిన తాత్కాలిక భవనాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యాలయ భవనా నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలిక తరగతి గదుల్లో తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు. నిర్మాణానంతరం తరగతులు విద్యాలయ క్యాంపస్‌లోకి మారుస్తామని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి 7 ఎకరాల స్థలం కేటాయించామన్నారు. ఎంప్లాయీస్‌ కాలనీలో నిరుపయోగంగా ఉన్న పాఠశాలలో తాత్కాలిక తరగతులు నిర్వహిస్తామని, రూ.80లక్షల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణం జరుగుతుందన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రషీద్‌, వైస్‌ ఛైర్మన్‌ సత్యనారాయణ, కౌన్సిలర్‌ శీలం రాము, మున్సిపల్‌ డీఈఈ లక్ష్మీ నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this