General Bipin Rawat: రావత్ నోట చివరి...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

General Bipin Rawat: రావత్ నోట చివరి మాట అదే.. బోరున విలపించిన ప్రత్యక్ష సాక్షి.. ఎందుకంటే..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 General Bipin Rawat: హెలికాప్టర్‌ ప్రమాదంలో చిక్కుకొని తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న బిపిన్‌ రావత్‌ తనను నీళ్లు కావాలని అడిగారని శివకుమార్‌ అనే వ్యక్తి మీడియాకు తెలిపారు. అయితే, ఏటవాలు ప్రాంతంలో ఆయన పడి ఉండడంతో సత్వరం రక్షించేందుకు వీలు కాలేదని చెప్పారు. ఆయన అంత పెద్ద మనిషి అని అప్పుడు తెలియలేదని.. ఆ తర్వాత ఎవరో ఫొటో చూపించినప్పుడు తెలిసిందన్నారు. తలుచుకుంటే బాధనిపిస్తోందని, ఆ రోజు రాత్రంతా నిద్రపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శివకుమార్‌ స్థానిక కాంట్రాక్టరు. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ రావత్‌ దంపతులు సహా 13 మందిని బలిగొన్న హెలికాప్టర్‌ ప్రమాదానికి ఆయన ప్రత్యక్ష సాక్షి.

‘‘వేరే పని కోసం నేను రోడ్డుపై నడిచి వెళుతుండగా…పలువురు హెలికాప్టర్‌ కూలిందని కేకలుపెట్టారు. వారితోపాటు నేనూ ఆ ప్రాంతానికి వెళ్లాను. చెట్టును ఢీకొన్న హెలికాప్టర్‌ నుంచి మంటలు వస్తున్నాయి. అక్కడ ముగ్గురు కొన ప్రాణాలతో అల్లాడిపోవడం కనిపించింది. వారిలో ఒకరు తనను కాపాడాలని వేడుకుంటూ, మంచి నీళ్లు ఇవ్వాలని సైగలు చేశారు. చుట్టూ పొదలు ఉండడంతో వెంటనే దగ్గరకు వెళ్లలేకపోయాను. ఇంతలో భద్రతా దళాలు అక్కడకు చేరుకుని ఆయనను, మరొకరిని దుప్పట్లలో చుట్టి అక్కడినుంచి తీసుకుపోయాయి. ఆ తరువాత తెలిసింది… ఆయనే బిపిన్‌ రావత్‌ అని’’ అని శివకుమార్‌ పేర్కొన్నారు. కాగా, బిపిన్‌ రావత్‌ చివరి క్షణాల్లో హిందీలో మాట్లాడారని, ‘నేనే బిపిన్‌ రావత్‌ని’ అంటూ నెమ్మదిగా పలికారని సహాయక చర్యల్లో పాల్గొన్న అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. అవే ఆయన చివరి మాటలు!.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this