Electricity Consumption: డిసెంబర్‎లో పెరిగిన విద్యుత్ డిమాండ్.....

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Electricity Consumption: డిసెంబర్‎లో పెరిగిన విద్యుత్ డిమాండ్.. ఎందుకంటే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 దేశంలో విద్యుత్ డిమాండ్ పెరిగింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే డిసెంబర్ మొదటి 10 రోజుల్లో దేశంలో విద్యుత్ వినియోగం దాదాపు 1.3 శాతం పెరిగి 34.23 బిలియన్ యూనిట్లకు (BU) చేరుకుందని విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందుకు సంబంధించి గణాంకాలను విడుదల చేసింది. గత ఏడాది ఇదే కాలంలో విద్యుత్ వినియోగం 33.78 బిలియన్ యూనిట్లు. 2020 డిసెంబర్ నెలలో మొత్తం విద్యుత్ వినియోగం 105.62 బిలియన్ యూనిట్లు కాగా.. డిసెంబర్ 2019లో ఇది 101.08 బిలియన్ యూనిట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే విద్యుత్ సరఫరా పెరిగింది. దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడమే డిసెంబర్‌లో విద్యుత్ డిమాండ్ మెరుగుపడటానికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. డిసెంబర్ మొదటి 10 రోజులలో, గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 169.12 GW వద్ద ఉంది.

ఈ ఏడాది నవంబర్‌లో విద్యుత్ వినియోగం 2.6 శాతం పెరిగి 99.37 బిలియన్ యూనిట్లకు చేరుకుంది. గతేడాది నవంబర్‌లో ఈ వినియోగం 96.88 బిలియన్ యూనిట్లు కాగా, 2019 నవంబర్‌లో 93.94 బిలియన్ యూనిట్లుగా ఉంది. అక్టోబర్‌లో విద్యుత్ వినియోగం 3.3 శాతం పెరిగి 112.79 బిలియన్ యూనిట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే నెలలో 109.17 బిలియన్ యూనిట్లుగా నమోదయ్యాయి.

ఈ ఏడాది ఏప్రిల్‌లో కోవిడ్-19 యొక్క రెండో వేవ్ తర్వాత, అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్‌కు డిమాండ్‌ తగ్గుముఖం పట్టింది. కోవిడ్ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత విద్యుత్ వినియోగం పెరిగింది. ఈ ఏడాది మేలో విద్యుత్ వినియోగం 6.6 శాతం పెరిగి 108.80 యూనిట్లకు చేరుకుంది. మే, 2020లో ఇది 102.08 బిలియన్ యూనిట్లుగా ఉంది. జూన్‌లో విద్యుత్ వినియోగం దాదాపు తొమ్మిది శాతం పెరిగి 114.48 బిలియన్ యూనిట్లకు చేరుకుంది. జూన్, 2020లో ఇది 105.08 బిలియన్ యూనిట్లుగా ఉంది.

electricity consumption: డిసెంబర్‎లో పెరిగిన విద్యుత్ డిమాండ్.. ఎందుకంటే..


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this