Bank Jobs : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Bank Jobs : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41వేలకు పైగా ఉద్యోగాలు.. కేంద్రం కీలక ప్రకటన

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Bank Jobs : దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాలకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రస్తుతం ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఇంకా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి? అనే వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 41వేల 177 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. బ్యాంకులకు మంజూరు చేసిన మొత్తం పోస్టుల్లో ఇది 5శాతానికి సమానం అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 8,05,986 ఉద్యోగాలు ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం ఎస్బీఐలో అత్యధికంగా 8,544 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది.

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీలు ఎక్కువగా ఉండటంతో ఉద్యోగులపై ఒత్తిడి పెరిగిపోయిన విషయం ప్రభుత్వానికి తెలుసా..? అని లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. డిసెంబర్‌ 1వ తేదీ నాటికి బ్యాంకులకు కేటాయించిన పోస్టుల్లో 95శాతం భర్తీ అయ్యాయని ఆమె వెల్లడించారు. పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులకు కేటాయించిన 8,05,986 ఉద్యోగాల్లో కేవలం 41,177 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని వివరించారు. మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆఫీసర్‌, క్లర్క్‌, సబ్‌స్టాఫ్‌ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయని తెలిపారు.

ఏ బ్యాంకులో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే..

* ఎస్బీఐలో 8వేల 544

* పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో 6వేల 743

* సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో 6వేల 295

* ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌లో 5వేల 112

* బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 4వేల 848 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

కాగా, గత ఆరేళ్లలో పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌లో మాత్రమే ఒక్క పోస్టు తగ్గించామని, మిగిలిన బ్యాంకుల పోస్టుల్లో ఎటువంటి కోత విధించలేదని కేంద్రమంత్రి వివరించారు. బ్యాంకులు వాటి అవసరాలకు తగినట్లు నియామకాలు చేపడుతున్నాయని కేంద్రమంత్రి క్లారిటీ ఇచ్చారు.

bank jobs : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41వేలకు పైగా ఉద్యోగాలు.. కేంద్రం కీలక ప్రకటన


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this