Tragedy: కూలిన స్కూల్ గోడ.. చితికిన విద్యార్థుల...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Talliki Vandanam (తల్లికి వందనం) Attendance Check – ఇప్పుడు మొబైల్ లోనే మీ పిల్లల హాజరు శాతం తెలుసుకోండి!

ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల Talliki Vandanam Attendance Percentage ఎంత...

How to Know Thalliki Vandanam Eligibility Status | తల్లికి వందనం ఏలిజిబిలిటీ స్టేటస్

తల్లికి వందనం పథకం 2026-27 – అర్హత స్థితి తనిఖీ విధానం2026-27...

Tragedy: కూలిన స్కూల్ గోడ.. చితికిన విద్యార్థుల బ్రతుకులు.. ముగ్గురు దుర్మరణం..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 తమిళనాడు తిరునెల్వేలిలో విషాదం చోటుచేసుకుంది. ఓ పురాతన పాఠశాలలో ఊహించని ప్రమాదం జరిగింది. టాయిలెట్ గోడ కూలిపోయి ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు స్టడెంట్స్ తీవ్రంగా గాయపడ్డారు. తిరునెల్వేలి ఎగ్జిబిషన్​ గ్రౌండ్​కు సమీపంలోని స్కాఫ్టర్​ హైస్కూల్ అత్యంత పురాతనమైంది. శుక్రవారం ఉదయం.. స్కూల్‌లోని టాయిలెట్ గోడ కూలిపోయింది. అక్కడే ఉన్న ముగ్గురు 8వ తరగతి విద్యార్థులపై శిథిలాలు పడటం వల్ల తీవ్రంగా గాయపడి స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో ఇద్దరు విద్యార్థులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంబంధిత అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకుంది.  మరోవైపు.. 100 ఏళ్లకుపైగా నడుస్తోన్న స్కూల్లో బిల్డింగ్స్, గోడలు శిథిలావస్థకు చేరుకున్నా.. వాటిని పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. విద్యార్థుల నిండు భవిష్యత్‌కు బాటలు పరుచుకునే చోట.. వారి జీవితాలు అంతమైన ఘటన అందర్నీ కన్నీరు పెట్టిస్తుంది.

tragedy: కూలిన స్కూల్ గోడ.. చితికిన విద్యార్థుల బ్రతుకులు.. ముగ్గురు దుర్మరణం..

 విద్యార్థుల మృతి పట్ల  తెలంగాణ రాష్ట్ర గవర్నర్​ తమిళిసై సౌందర రాజన్​ సంతాపం తెలిపారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this