Mid Day Meal: దళిత మహిళలు స్కూల్...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

Mid Day Meal: దళిత మహిళలు స్కూల్ లో వంట చేయకూడదా ?? ఇదేమి తీరు…

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Mid Day Meal: పెద్దలే కాదు.. పిల్లల్లోనూ కుల వివక్షకు సంబంధించి విష బీజాలు నాటుకుంటున్నాయి. దీనికి సంబంధించి ఘటన తాజాగా ఉత్తరాఖండ్‌లో వెలుగు చూసింది. 

దళిత మహిళ వంట చేసిందనే కారణంతో ప్రభుత్వ పాఠశాలలోని కొందరు విద్యార్థులు ఆ ఆహారాన్ని తినడానికి నిరాకరించారు. ఉత్తరాఖండ్‌లోని చంపావత్‌ జిల్లా సుఖిధాంగ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఈ వ్యవహారం సంచలనంగా మారడంతో.. అధికారులు స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.

సుఖిధాంగ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 60 మంది విద్యార్థుల్లో 40 మంది విద్యార్థులు జనరల్ కేటగిరికి చెందిన వారే. మిగతా 20 మంది షెడ్యూల్ కులాలకు చెందిన వారు ఉన్నారు. 

అయితే కొద్ది రోజుల క్రితమే ఆ పాఠశాలలో మధ్యాహ్నం భోజనాలు వండే మహిళ ఉద్యోగ విరమణ పొందింది. ఆమె తరువాత షెడ్యూల్ కులానికి చెందిన సునీతా దేవి.. మధ్యామ్నం భోజనాలు వండేందుకు ఉద్యోగంలో చేరింది. కాగా, తాజాగా ఆమె పాఠశాలలో భోజనం వండగా.. స్కూల్‌లోని జనరల్ కేటగిరి విద్యార్థులు నిరాకరించారు. 

మరోవైపు ఆ విద్యార్థులు తల్లిదండ్రులు సైతం స్కూల్‌కు వచ్చి ఆందోళన చేపట్టారు. స్కూల్‌లో జనరల్ కేటగిరీ విద్యార్థులే ఎక్కువగా ఉంటారు కాబట్టి.. ఈ కేటగిరికి చెందిన మహిళలనే వంట వారిగా నియమించాలని డిమాండ్ చేశారు. ప్రధానోపాధ్యాయుని తీరుపై విమర్శలు గుప్పించారు. దాంతో పాఠశాల వద్ద కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.

అయితే, ఈ ఘటన స్థానికంగా పెను ప్రకంపనలు సృష్టించింది. కుల వివక్ష చూపుతున్నారంటూ భోజనం వండిన మహిళ పోలీస్ స్టేషన్‌లో, విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. 

mid day meal: దళిత మహిళలు స్కూల్ లో వంట చేయకూడదా ?? ఇదేమి తీరు...

మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించారు అధికారులు. అసలేం జరిగిందని వివరాలు సేకరించారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this