Andhra PradeshMega DSC Notification : ‘ఒక్క ప్రభుత్వ...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Mega DSC Notification : ‘ఒక్క ప్రభుత్వ బడిని మూసేది లేదు.. ఈ ఏడాదిలోపే మెగా డీఎస్సీ పూర్తి’.. మంత్రి లోకేష్‌

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Mega DSC Notification : గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ-117 వల్ల గత ఐదేళ్లలో దాదాపు 12 లక్షల మంది పేద పిల్లలకు చదువు దూరమైందని మంత్రి లోకేశ్‌ స్పష్టం చేశారు. ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా మూసే ప్రసక్తి లేదనీ.. ఒక్క విద్యార్ధి ఉన్నా కొనసాగిస్తామని అన్నారు. విద్యార్ధుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని ఏప్రిల్‌ 24 తర్వాత నేరుగా ఆయా కాలేజీల ఖాతాల్లో..

mega dsc notification
july 12, 2026, 2:00 pm - duniya360

గత ప్రభుత్వం తప్పిదం వల్ల గత ఐదేళ్లలో 12 లక్షల మంది పేద పిల్లలకు చదువు దూరమైందని మంత్రి లోకేశ్‌ స్పష్టం చేశారు. ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా మూసే ప్రసక్తి లేదనీ అన్నారు. విద్యార్ధుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని ఏప్రిల్‌ 24 తర్వాత నేరుగా ఆయా కాలేజీల ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో టీచర్లపై పెట్టిన కేసులను కూటమి సర్కార్ కొట్టివేస్తుందని అన్నారు. ఈ మేరకు విద్యారంగ సంస్కరణలపై మండలిలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల పతనానికి జీఓ-117 కారణమని, పదిమంది పిల్లల కంటే తక్కువ ఉన్న పాఠశాలలు టీడీపీ హయాంలో కేవలం 1215 ఉంటే, అదే జీఓ-117 వల్ల ఆ సంఖ్య 5,500కు చేరిందని అన్నారు. 20 మంది కంటే తక్కువ ఉన్న పాఠశాలల సంఖ్య 5,520 నుంచి 12,512కు పెరిగాయని వివరించారు.

ఒక్క విద్యార్ధి ఉన్నా కొనసాగిస్తామని.. ఒక్క ప్రభుత్వ పాఠశాలనూ మూసేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో ఒక నమూనా ప్రాథమిక పాఠశాల ఏర్పాటుచేసి, తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయిస్తామన్నారు. పాఠశాలల ప్రారంభానికి ముందే ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామన్నారు. దీనికోసం అమరావతిలో ప్రపంచస్థాయి శిక్షణ అకాడమీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉందన్నారు. ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా ఆన్‌లైన్‌లో ఉంచుతామని, దాని ఆధారంగా బదిలీలు ఉంటాయని తెలిపారు.

Mega DSC Notification : ‘ఈ ఏడాదిలోనే డీఎస్సీ నియామకాలు పూర్తి’

ఎస్సీ వర్గీకరణపై కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందించిందని మంత్రి లోకేష్ తెలిపారు. ప్రభుత్వం దీన్ని పరిశీలిస్తోందని, అనంతరం కేబినెట్‌ ఆమోదంతో ఎస్సీ కమిషన్‌కు పంపుతామన్నారు. కమిషన్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిన తర్వాత డీఎస్సీ ప్రకటన జారీ చేస్తామన్నారు. మొత్తానికి ఈ ఏడాదిలోనే నియామక ప్రక్రియ పూర్తిచేస్తామని పేర్కొన్నారు. విద్యార్ధుల పుస్తకాల భారాన్ని కూడా తగ్గిస్తామన్నారు. గతంలో 8 పుస్తకాలు ఇచ్చేవారని, కానీ ఒకటో తరగతి విద్యార్థులకు మొదటి సెమ్‌లో 2, రెండో సెమ్‌లో 2 చొప్పున మొత్తం నాలుగు పుస్తకాలు ఇస్తామన్నారు. ఇలా అన్ని తరగతుల్లో పుస్తకాల సంఖ్య తగ్గించి పిల్లల బ్యాగ్ బరువు తక్కువ చేస్తామన్నారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this