Work From Home : కొవిడ్‌ ఉద్ధృతిపై.....

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

Work From Home : కొవిడ్‌ ఉద్ధృతిపై.. ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • పాల్గొన్న వివిధ శాఖల ఉన్నతాధికారులు

దిల్లీ: గతకొన్ని రోజులుగా దేశంలో కొవిడ్‌ ఉద్ధృతి పెరిగిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగుతోన్న ఈ భేటీలో ఆరోగ్యశాఖతో పాటు కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ నిపుణులు, ఇతర మంత్రిత్వశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. థర్డ్‌వేవ్‌ ప్రభావంతో దేశవ్యాప్తంగా పెరుగుతోన్న కేసులు, వైరస్‌ కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడం, మెడికల్‌ ఆక్సిజన్‌, ఔషధాల ముందస్తు నిల్వ, వైరస్‌ ఉద్ధృతిని ఎదుర్కొనేందుకు వివిధ శాఖల సంసిద్ధత వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా మోదీ సమీక్ష జరిపినట్లు తెలుస్తోంది. దీనికి ముందు డిసెంబర్‌ 24న కొవిడ్‌పై ప్రధాని సమీక్ష నిర్వహించారు.

వారికి వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌…

దేశంలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులు, గర్భిణులకు వర్క్‌ ఫ్రమ్ హోమ్‌ వెసులుబాటు ఇస్తున్నట్లు వెల్లడించింది. అలాగే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న కంటైన్‌మెంట్‌ జోన్లలోని ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి కూడా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సౌలభ్యం కల్పిస్తున్నట్లు తెలిపింది. కంటైన్‌మెంట్‌ జోన్‌ జాబితా నుంచి తొలగించాకే కార్యాలయానికి రావాలని సూచించింది.

ఇక గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 1.6లక్షల కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కొవిడ్‌ క్రియాశీల కేసుల సంఖ్య 6లక్షలకు చేరింది. చాలా రాష్ట్రాల్లో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 10శాతం దాటింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 3623 ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు గుర్తించారు. సాంకేతికంగా ఇప్పటివరకు ఇన్ని కేసులు గుర్తించినప్పటికీ వాస్తవంగా ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావంతోనే దేశంలో వైరస్‌ ఉద్ధృతి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ భావిస్తోంది.

work from home : కొవిడ్‌ ఉద్ధృతిపై.. ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం!


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this