PM Meeting Today : ముఖ్యమంత్రులతో ఈ...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

PM Meeting Today : ముఖ్యమంత్రులతో ఈ రోజు ప్రధాని మోడీ సమావేశం.. లాక్ డౌన్ అమలు పైనే ప్రధాన చర్చ..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

pm meeting today : ముఖ్యమంత్రులతో ఈ రోజు  ప్రధాని మోడీ సమావేశం.. లాక్ డౌన్ అమలు పైనే ప్రధాన చర్చ..

PM Meeting Today : దేశ వ్యాప్తి కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్‌గా సమావేశం కానున్నారు. 

PM Meeting Today

గురువారం సాయంత్రం నాలుగున్నరకు ఈ సమావేశం జరగనుంది. దేశంలో కోవిడ్ పరిస్థితిపై చర్చిస్తారు. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షిస్తారు. ముఖ్యమంత్రులతో సమావేశం తర్వాత కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. 

ఇప్పటికే అనేక రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించాయి. తమిళనాడులో ఆదివారాలు లాక్‌డౌన్ కొనసాగుతోంది.

లాక్ డౌన్ పెడితే ఆర్థికంగా ఇబ్బందులే – PM Meeting Today

కరోనా కాలంలో చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యారు. కరోనా బారిన పడి ఆస్పత్రుల పాలైన వారు కొందరైతే.. ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడిన వారు మరి కొందరున్నారు. 

కోవిడ్‌ మహమ్మారి కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోయి ఆర్థికంగా, తిండిలేక ఎన్నో కష్టాలను పడ్డారు. అదే అదనుగా భావించి కొందరు మోసగాళ్లు జనాలను బురిడికొట్టిస్తున్నారు. 

జనాలను కొత్త కొత్త పద్దతుల్లో మోసగిస్తున్నారు. మోసగాళ్లు బ్యాంకు ఖాతాలపై కన్నెసి ఖాతాలో ఉన్న డబ్బులన్ని తస్కరిస్తున్నారు.

వెలుగులోకి వచ్చిన కొత్తరకం మోసం

కరోనా సమయంలో మోసగాళ్లు కొత్తరకం మోసాలకు పాల్పడుతున్నారు. కోవిడ్‌ పేరుతో జనాలను బురిడి కొట్టిస్తున్నారు. ఇటీవల సోషల్‌ మీడియాలో ఓ అంశం వైరల్‌ అయ్యింది. 

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కోవిడ్‌ ఫండ్స్‌ నుంచిరూ.5వేలు అందిస్తోందని కొందరు సోషల్‌ మీడియాలో మెసేజ్‌లను వైరల్‌ చేస్తున్నారు. 

దీనికి ఆ ఫండ్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 15వ తేదీ చివరి గడువు అని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే ఇలాంటి మెసేజ్‌లను, లింక్‌లను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తూ జనాలను మోసగిస్తున్నారు మోసగాళ్లు. 

కేంద్ర ప్రభుత్వం ఇలాంటి స్కీమ్‌ తీసుకురాలేదు. మోసగాళ్లు సోషల్‌ మీడియాలో ఈ స్కీమ్‌ పేరుతో లింక్‌లను పెడుతూ ప్రజల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో నమ్మి మోసపోవద్దని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this