AP Schools : ఏపి లో స్కూల్స్...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

AP Schools : ఏపి లో స్కూల్స్ కు శలవులు పొడిగించే ఆలోచన లేదు – విద్యాశాఖా మంత్రి

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఏపీలో సంక్రాంతి సెలవులు పొడిగించే ప్రసక్తే లేదు: మంత్రి సురేష్.

అమరావతి: ఏపీలో స్కూళ్లకు సెలవుల పొడగింపుపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టత ఇచ్చారు. పాఠశాలలకు సెలవులు పొడగించే ఆలోచన లేదని తేల్చిచెప్పారు. సంక్రాంతి సెలవుల పోడిగింపుపై విద్యాశాఖలో విస్తృత చర్చ జరిగింది. అయితే స్కూళ్లకు సెలవుల పెంపు సోమవారం విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. ఇంతలోనే పాఠశాలలకు సెలవులు పొడగించే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు ఇప్పటికే 13.87శాతానికి చేరడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులకు వ్యాక్సినేషన్ పూర్తికానందున పాఠశాలలు నడిపే విషయంలో విద్యాశాఖ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. స్కూళ్లను కొనసాగిస్తే కరోనా కేసులు వెలుగు చూస్తే ఏం చేయాలనే దానిపై ప్రభుత్వానికి స్పష్టత లేదు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వేగం పెంచింది. కేసులు భారీగా నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో యాక్టివ్‌ కేసులు కూడా రాకెట్‌ వేగంతో దూసుకెళ్తున్నాయి. ఇలాంటి సమయంలో స్కూళ్లకు తెరిస్తే వైరస్ వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవుల పొడిగింపుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు ప్రభుత్వం సెలవులు పొడిగించినట్లు వెల్లడించింది. అధికారికంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీ  ప్రకటించారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన సంక్రాంతి సెలవులు నేటితో ముగియనున్నాయి. ఈ నెల 8 నుంచి నేటి వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారికంగా సీఎస్ సోమేశ్ కుమార్ ప్రకటించారు. ఆన్‌లైన్‌లో తరగతులను నిర్వహించుకోవాలని  ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. విద్యాసంస్థలకు విద్యాశాఖ సూచించింది


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this