Sunday, January 18, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
KFD Monkey Fever : దేశంలో కలకలం...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) 2025: సంపూర్ణ మార్గదర్శకాలు

పరిచయం:ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం, రాష్ట్రంలో తరగతి 1 నుండి 8 వరకు ఉపాధ్యాయులుగా నియమితులవ్వాలనుకునే...

KFD Monkey Fever : దేశంలో కలకలం రేపుతున్న మంకీ ఫీవర్.. ఆ వైరస్ ఏంటి? ఎవరికి సోకుతుంది?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

KFD Monkey Fever మంకీ ఫీవర్‌తో బాధపడుతూ ఓ మహిళ ఆస్పత్రి చేరడం కలకలం సృష్టిస్తోంది. 

KFD Monkey Fever

కర్ణాటకలోని షిమోగా గ్రామానికి చెందిన 57 ఏళ్ల మహిళకు క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ సోకింది. దీన్నే మంకీ ఫీవర్ అంటారు. వైద్యుల పరీక్షలో ఈ వ్యాధి నిర్ధారణ అయ్యింది. షిమోగా గ్రామానికి చెందిన మహిళ కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడంతో శి

కోతుల జ్వరంతో ఆసుపత్రి పాలైన షిమోగా మహిళ శివమొగ్గలోని ప్రభుత్వాస్పత్రిలో చేరింది. రక్త నమూనాలు సేకరించి పరీక్షించిన వైద్యులు.. ఆమెకు కేఎఫ్‌డీ నిర్ధారించారు. ఇదే విషయాన్ని శివమొగ్గ హెల్త్ ఆఫీసర్ రాజేష్ సురగిహళ్లి వెల్లడించారు. ఈ కేఎఫ్‌డీని మంకీ ఫీవర్ అని కూడా అంటారు. 

ఇది క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ వైరస్ వల్ల వస్తుందని వైద్యులు తెలిపారు. ఈ వైరస్, ప్రధానంగా కీటకాల ద్వారా వస్తుందని, కోతులు, మనుషులపై ప్రభావం చూపుతుందని వైద్యాధికారులు తెలిపారు. ఈ వ్యాధి సోకిన వారికి 12 రోజుల వరకు తీవ్ర చలి జ్వరం, తలనొప్పి, బాడీ పెయిన్స్ వంటి లక్షణాలు ఉంటాయని పేర్కొన్నారు. కాగా, ఈ వ్యాధి సోకిన వారిలో 3 నుంచి 5 శాతం మరణాల రేటు ఉంటుందన్నారు.

మంకీ ఫీవర్ అంటే ఏంటి?..

KFD ని మంకీ ఫీవర్ అని కూడా పిలుస్తారు. ఇది టిక్-బర్న్ వైరల్ హెమరేజిక్ వ్యాధి. ఇది మానవులకు, కోతులకు ప్రాణాంతకం. క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ వైరస్ (ఫ్లావివిరిడే, ఫ్లావివైరస్ జాతికి చెందినది) ‘పేను’ జాతికి చెందినది. ఈ వ్యాధి పేను జాతుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా హేమోఫిసాలిస్ స్పినిగెరా(నల్లులు, గోమార్లు) ప్రధాన వ్యాప్తి కారణంగా పరిగణించబడుతుంది. 

అయితే.. చిన్న చిన్న ఎలుకలు, కోతులు, పక్షులు క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ వైరస్ (KFDV) వ్యాప్తిలో భాగం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పేళ్లు, నల్లులు, గోమార్లు(బగ్స్) పశువుల ద్వారా ప్రయాణించి.. కేడీఎఫ్ వ్యాధిని మనుషులకు సోకేందుకు కారణం అవుతాయి. వైరస్ సోకిన బగ్ జంతువును గానీ, మనిషిని గానీ కరిచినప్పుడు ఆ వ్యాధి సంక్రమిసతుంది. 

అయితే, మనుషులే ఈ వ్యాధికి డెడ్ ఎండ్ హోస్ట్‌లుగా పేర్కొంటున్నా నిపుణులు. ఎందుకంటే మనుషుల నుంచి ఇతరులకు ఆ వైరస్ సోకదట. అయితే, ఈ వైరస్ వ్యాప్తిని అణిచివేసేందుకు, కేఎఫ్‌డీవీకి వ్యతిరేకంగా న్యూట్రలైజింగ్ యాంటీబాడీలను అభివృద్ధి చేయడం ద్వారా ఈ వ్యాధి ప్రభావాన్ని తగ్గించవచ్చని వైద్యులు చెబుతున్నారు.

ఎవరు ప్రభావితమయ్యారు?

KFD మొదటిసారిగా 1957లో భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని క్యాసనూర్ ఫారెస్ట్‌లో బయటపడింది. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలకు ఈ వైరస్ వ్యాప్తి చెంది. 2012 నుంచి ప్రతి సంవత్సరం 500 లకు పైగా మంకీ ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి. 

KFD ద్వారా ప్రభావితమైన వారిలో 5 నుంచి 10% మంది బాధితులు రక్తస్రావ లక్షణాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఐదేళ్లలో ఈ వ్యాధి కారణంగా కనీసం 340 మంది ప్రాణాలు కోల్పోయారు.

క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ ద్వారా ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో పని చేసే వారు ప్రభావితమవుతున్నారు. ఏడాది పొడవునా జంతువులను మేపే వారు, రైతులు, అటవీ సంపద కోసం అడవుల్లో కూలీ పనులు చేసే వారు, తోటలలో పనులకు వెళ్లే వారు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. 

Karnataka | A 57-year-old woman in Kudige village of Thirthahalli admitted to hospital with Kyasanur Forest Disease (KFD). Patient was suffering from fever for a few days, following which her blood sample was collected & tested for KFD:Shivamogga Health Officer Rajesh Suragihalli pic.twitter.com/JKEAQzqQQn

— ANI (@ANI) January 22, 2022


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this