Life StyleTips To Save Cooking Gas: ఈ...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Tips To Save Cooking Gas: ఈ సింపుల్‌ టిప్స్‌ పాటిస్తే చాలు…. మీ వంట గ్యాస్‌ ఆదా అవుతుంది..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

గ్యాస్‌ స్టౌవ్‌ వాడే ముందు.. గ్యాస్ బర్నర్‌ని శుభ్రంగా ఉంచండి. శుభ్రం చేయకపోతే, పైపు ద్వారా గ్యాస్ సరిగ్గా సప్లై కాదు. పైప్‌లో గ్యాస్‌ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కనీసం రెండు వారాలకు ఒకసారి గ్యాస్ బర్నర్‌ను శుభ్రం చేయడం మంచిది. బియ్యం, పప్పు వంటి కొన్ని ధాన్యాలతో వండేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. బియ్యం, పప్పులు వంటి ధాన్యాలు వంటకు ముందు కడిగి నీటిలో నానబెట్టుకోవటం ఉత్తమం. ఇలా చేస్తే గ్యాస్ ఆదా అవుతుంది. వంట కూడా త్వరగా పూర్తవుతుంది.

కుక్కర్, పాత్రలు మొదలైనవాటిని కడిగిన తర్వాత వెంటనే…నేరుగా వంట చేయడం వల్ల ఎక్కువ గ్యాస్ ఖర్చవుతుందని మీకు తెలుసా? అవును… వంట చేసే పాత్రలను కడిగిన వెంటనే స్టవ్‌పై ఉంచినట్లయితే, డిష్ వేడెక్కడానికి కొంత సమయం పడుతుంది. దీని వలన గ్యాస్ ఖర్చవుతుంది. చాలా మంది కుక్కర్‌కు బదులుగా ఇతర పాత్రలను ఉపయోగిస్తారు. కానీ గ్యాస్ ఉపయోగించి వంట చేసే వారు ప్రెషర్ కుక్కర్ వాడటం మంచిది. దీనివల్ల గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు.

ప్రెషర్ కుక్కర్‎లో వంట చేయడం వల్ల గ్యాస్‎ను సులభంగా ఆదా చేసుకోవచ్చు. ప్రెషర్‌ కుకర్‌ అధిక పీడనంతో ఆవిరి మీద ఆహారాన్ని ఉడికిస్తుంది పైగా రెండు మూడు రకాలను ఒకేసారి కుక్కర్‌లో పెట్టుకునే వీలు ఉంది. కాబట్టి త్వరగా వంట పూర్తి అవుతుంది. గ్యాస్‌ కూడా ఆదా అవుతుంది. ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్‌ నుంచి తీసిన వెంటనే నేరుగా గ్యాస్‎పై పెట్టి వేడి చేసే అలవాటు కూడా గ్యాస్‌ను వృధా చేస్తుంది. అలా చేయడం వల్ల ఆహారం వేడి అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. దాని వల్ల ఎక్కువ గ్యాస్ ఖర్చవుతుంది. ఫ్రిజ్ నుంచి ఆహారం బయటకు తీసిన తర్వాత ముందు సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకురావాలి. ఆ తర్వాతే దాన్ని వేడి చేయండి. ఇలా చేస్తే మీ గ్యాస్‌ ఆదా అవుతుంది. చిన్న చిన్న పాత్రల్లో వంటలు చేస్తున్నప్పుడు పెద్ద బర్నర్‌ ను వాడకపోవడమే మంచిది. అలా వాడటం వల్ల మంట చాలా వరకు బయటికి పోతుంది. అలా కూడా గ్యాస్‌ వృథా అవుతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు చిన్న బర్నర్‌నే వాడటం మంచిది.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this