EntertainmentRam Charan: మన రామ్ చరణ్ తేజ్‌కు...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

Ram Charan: మన రామ్ చరణ్ తేజ్‌కు మరో అరుదైన గౌరవం?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ప్రస్తుతం టాలీవుడ్ గురించి ప్రపంచం మొత్తం చెప్పుకుంటోంది. బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, కల్కి.. వంటి పాన్ ఇండియా సినిమాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా రేంజ్‌ను పెంచాయి. ఆ సినిమాలకే కాకుండా అందులో నటించిన హీరోలకు కూడా అంతే గుర్తింపు లభిస్తోంది.

ఆ గుర్తింపుతోనే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఆర్గనైజర్స్ తెలుగు హీరోలకు అరుదైన అవకాశాలను కల్పిస్తోంది… ఇప్పటి వరకు వేరే ఇండస్ట్రీలకే పరిమితమైన ఈ గౌరవం.. ఇప్పుడు తెలుగు హీరోలకు సైతం దక్కడం విశేషంగానే చెప్పాలి… తాజాగా ప్రముఖ టాలీవుడ్‌ హీరోకు ఇలాంటి అవకాశమే వచ్చింది.. లండన్‌లో గౌరవం దక్కించుకున్న ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం…

లండన్‌లోని ప్రతిష్టాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌ వాక్స్ మ్యూజియంకి ఎంతో గుర్తింపు ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆయా రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖుల మైనపు బొమ్మలు ఈ మ్యూజియంలో ఏర్పాటు చేస్తుంటారు. ఈ క్రమంలోనే తెలుగు సినిమాకు అంతర్జాతీయ సొబగులు అద్దిన ప్రముఖ హీరోలు ప్రభాస్, మహేశ్‌ బాబు, అల్లు అర్జున్ విగ్రహాలను మేడమ్‌ టుస్సాడ్స్‌ వాక్స్‌ మ్యూజియంలో ఏర్పాటు చేశారు.

ఏర్పాట్లు పూర్తి?
ఇప్పుడు ఈ లిస్టులో మరో టాలీవుడ్‌ హీరో రామ్ చరణ్‌ కూడా చేరుతున్నట్లు సమాచారం. లండన్‌లో ఉన్న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వాళ్లు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు టాలీవుడ్‌ టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్‌కి ఉన్న పాపులారిటీ, ఫాలోయింగ్‌ను తెలుసుకున్న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వాళ్లు.. వెంటనే ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారంటున్నారు.

గేమ్ ఛేంజర్ సినిమాలో తన షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న రామ్‌చరణ్‌ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇటీవల ఫ్యామిలీతో కలసి అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుకలకు వెళ్లిన రామ్‌చరణ్‌… అక్కడ నుండి స్పెషల్ ప్లైట్‌లో లండన్ చెక్కెశాడు. ఈ లండన్‌ టూర్‌కి ప్రధాన కారణం మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఆహ్వానమే అంటున్నారు. దాదాపు 2 వారాలు హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేయాలని భావించిన రామ్‌చరణ్‌ పనిలోపనిగా మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం తయారు చేస్తున్న మైనపు బొమ్మకు అవసరమైన కొలతలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఐతే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఏర్పాటు చేస్తున్న విగ్రహానికి మరో విశేషం ఉందని అంటున్నారు. రామ్ చరణ్ ఎంతో ఎక్కువగా అభిమానించే తన పప్పీ రైమ్‌ని పట్టుకుని ఉన్న విగ్రహాన్ని ఈ మ్యూజియం వాళ్లు ఏర్పాటు చేయబోతున్నారట.. మొత్తానికి రామ్‌చరణ్‌ మైనపు విగ్రహం లండన్‌లో ఏర్పాటు చేయడంపై మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక లండన్‌ నుంచి తిరిగి వచ్చిన వెంటనే బుచ్చిబాబు సినిమా వర్క్ స్టార్ట్ చేస్తాడంటున్నారు.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this