BusinessLIC Policy: ఆ బ్యాంకుతో ఎల్ఐసీ కీలక...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

LIC Policy: ఆ బ్యాంకుతో ఎల్ఐసీ కీలక ఒప్పందం.. లక్ష్యం అందరికీ జీవిత బీమా..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కేంద్ర ప్రభుత్వం ఇన్సురెన్స్ కంపెనీలకు ఓ లక్ష్యాన్ని నిర్దేశించిన విషయం తెలిసిందే. 2047 నాటికి దేశంలో ప్రతి పౌరుడికి ఓ బీమా పాలసీ ఉండి తీరాలని పిలుపునిచ్చింది. ఈ లక్ష్యం దిశగా అన్ని బీమా కంపెనీలు తమ ఉత్పత్తులను విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రజలను చైతన్య పరుస్తూ ప్రతి ఒక్కరూ పాలసీలు తీసుకునే విధంగా మొబలైజ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో దేశంలోని అతి పెద్ద ఇన్సురెన్స్ కంపెనీ అయినా లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకస్యూరెన్స్ కంట్రిబ్యూషన్ పెంచడానికి, అందరికీ జీవిత బీమాను కవరేజీ అందించడానికి కార్పొరేట్ ఏజెన్సీ ఆధ్వర్యంలోని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తో ఒప్పందం కుదుర్చుకుంది. జూలై 16న రెండు కంపెనీలు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశాయి.

ఐడీఎఫ్సీ బ్యాంక్ నుంచి ఎల్ఐసీ పాలసీ..

ఎల్ఐసీ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తో చేసుకున్న ఈ ఒప్పందంతో ప్రత్యేకమైన వెసులుబాటు కలుగనుంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ కు చెందిన కోటి మంది కస్టమర్లు ఇప్పుడు ఈ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ద్వరా ఎల్ఐసీ పాలసీలను కొనుగోలు చేసే వెసులుబాటు కలిగింది. ఇందుకోసం ఇప్పటికే డిజిటల్ ఆన్ బోర్డింగ్ ప్రారంభించినట్లు ఎల్ఐసీ ఓ ప్రతికా ప్రకటనలో పేర్కొంది. ఇది పూర్తయిన తర్వాత, వినియోగదారులు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ వెబ్‌సైట్‌ నుంచి ఎల్ఐసీపాలసీలను కొనుగోలు చేయగలుగుతారు. ఇది కస్టమర్లకు ప్రత్యేక వెసులుబాటు ఇవ్వనుంది. ప్రతి ఒక్కరూ ఎల్ఐసీ పాలసీల గురించి తెలుసుకోవడానికి, పాలసీలను ప్రారంభించడానికి సులువైన మార్గాన్ని అందిస్తుంది.

2047 నాటికి అందరికీ బీమా..

దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 3,600 బ్రాంచ్‌లు, శాటిలైట్ ఆఫీసుల ద్వారా విస్తారమైన నెట్‌వర్క్.. అలాగే 1000 బ్రాంచ్‌ల ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ నెట్‌వర్క్ ద్వారా దేశవ్యాప్తంగా జీవిత బీమాను అందుబాటులోకి తెస్తుందని, అలాగే 2047 నాటికి అందరికీ బీమా లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇది సాయపడుతుందని ఎల్ఐసీ పేర్కొంది. జీవిత బీమా అనేది ప్రతి కుటుంబానికి రక్షణనిస్తుందని, అందుకు ఎల్ఐసీ తోడ్పాటునిస్తుందని పేర్కొంది. దేశంలోని అగ్రగామి బీమా కంపెనీ అయిన ఎల్ఐసీ సమాజంలోని అన్ని వర్గాల కోసం యాన్యుటీ, యులిప్, సేవింగ్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లతో సహా అనేక రకాల ఉత్పత్తులను కలిగి ఉంది. ఎల్ఐసీ అంటే జనాల్లో మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. దానికి ఇప్పుడు ప్రైవేటు బ్యాంక్ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ కూడా తోడవడంతో మరింత వేగంగా వ్యాపార వృద్ధి జరిగే అవకాశం ఉంటుంది.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this