Tuesday, October 14, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Science and TechnologyAuto MobileHyundai Exter CNG Dual Cylinder :...

DSC 2025 New Teachers: MEO Staff Contact Numbers Finder Tool

DSC 2025 లో నియమితులైన అందరు ఉపాధ్యాయులకు హార్థిక అభినందనలు! MEO...

DSC 2025 Web Options: School Head Master Contact Number with DISE Code | DSC School Selection Guide

Head Master Contact : DSC 2025లో ఎంపికైన అభ్యర్థులందరికీ అభినందనలు!...

BMI Calculator (BMI కాలిక్యులేటర్) – మీ BMI Calculate చేసుకుని మీ ఆరోగ్యాన్ని అర్థం చేసుకోండి

మీ ఆరోగ్యం, మీ ఎత్తు మరియు బరువుకు సరైన సంబంధం ఉందని...

Hyundai Exter CNG Dual Cylinder : డ్యూయల్ సిలిండర్లతో హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ కారు.. ధర, వేరియంట్లు, మైలేజీ పూర్తి వివరాలివే!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Hyundai Exter CNG Dual Cylinder : ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీతో ఎక్స్‌టర్ సీఎన్‌జీని లాంచ్ చేసింది. ఈ కంపెనీ పోటీదారు అయిన టాటా మోటార్స్ పంచ్ కూడా డ్యూయల్ సీఎన్‌జీ సిలిండర్‌లతో వస్తుంది. కొత్త హ్యుందాయ్ ఎక్స్‌టర్ హై-సీఎన్‌జీ డుయోని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. ఈ వాహనం గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ హై-సీఎన్‌జీ డ్యూయో ఇంజిన్ అండ్ ట్రాన్స్‌మిషన్ :
వాహనం 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేసిన 1.2-లీటర్ ద్వి-ఇంధన (సీఎన్‌జీతో పెట్రోల్) ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 69పీఎస్ పవర్, 95.2ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ లేదు.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ హై-సీఎన్‌జీ డుయో మైలేజ్ అండ్ ట్యాంక్ కెపాసిటీ :
వాహనం ఏఆర్ఏఐ-టెస్టింగ్ మైలేజ్ 27.1 కి.మీ/కిలోగ్రామ్. రెండు ట్యాంకుల మొత్తం సామర్థ్యం 60 లీటర్లు.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ హై-సీఎన్‌జీ డుయో వేరియంట్లు, ధర :
ఈ వాహనం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వేరియంట్ వారీగా హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ డ్యూయల్ సిలిండర్ ధరలు (ఎక్స్-షోరూమ్) కింది విధంగా ఉన్నాయి.

ఎస్ – రూ. 8,50,300
ఎస్ఎక్స్ – రూ. 9,23,300
నైట్ ఎస్ఎక్స్ – రూ. 9,38,200

హ్యుందాయ్ ఎక్స్‌టర్ హై-సీఎన్‌జీ డ్యూయో ఫీచర్లు :
ఫీచర్ల విషయానికి వస్తే.. వాహనంలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు, పూర్తిగా ఆటోమేటిక్ ఉష్ణోగ్రత నియంత్రణ, 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. సెక్యూరిటీ ఫీచర్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టీపీఎంఎస్ హైలైన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (HAC) ఉన్నాయి. ఈ వాహనం కంపెనీ అమర్చిన సీఎన్‌జీ వ్యవస్థను ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ (ECU)తో కలిగి ఉంది. పెట్రోల్ నుంచి సీఎన్‌జీకి మారే సమయంలో అద్భుతమైన డ్రైవింగ్ ఎక్స్‌‌పీరియన్స్ అందిస్తుంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ హై-సీఎన్‌జీ డ్యూయో వారంటీ :
హ్యుందాయ్ కంపెనీ అమర్చిన సీఎన్‌జీ సిస్టమ్‌కు మూడేళ్ల వారంటీ ఉంది. హ్యుందాయ్ డ్యూయల్ సిలిండర్ ఎక్స్‌టర్ సీఎన్‌జీతో పాటు సింగిల్ సిలిండర్ ఎక్స్‌టర్ సీఎన్‌జీని అందించడం కొనసాగిస్తుంది.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this