Will: వీలునామా అంటే ఏంటి.? వీలునామా రాయకపోతే...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Will: వీలునామా అంటే ఏంటి.? వీలునామా రాయకపోతే ఏమవుతుంది.?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Will: వీలునామా అంటే ఏంటి.? వీలునామా రాయకపోతే ఏమవుతుంది.?

ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆస్తులను ఎలా పంపిణీ చేయాలనుకుంటున్నారో వివరించే వీలునామాను రూపొందించాలి. వీలునామాను పకడ్బందీగా రూపొందించడం వెనకాల మరో కారణం ఉంది. చట్టపరమైన కోర్టు సమస్యల నుంచి వారసులను తప్పించవచ్చు. ఆసక్తిని సరైన విధంగా పంపిణీ జరిగేటట్లుగా పర్యవేక్షించడానికి వీలుంటుంది. అలాగే వారసుల మధ్య విభేదాలు రాకుండా ఉండడానికి…
will: వీలునామా అంటే ఏంటి.? వీలునామా రాయకపోతే ఏమవుతుంది.?

వీలునామా అనే పదం మనం సర్వసాధారణంగా వింటూనే ఉంటాం. పలాన వ్యక్తి చనిపోయే ముందు వీలునామా రాశారు అని చెబుతుంటారు. వారసులకు తమ ఆస్తిని పంచేందుకు వీలునామా రాస్తుంటారు. స్థిర, చరాస్తులు కలిగిన వారు తమ తదనంతరం ఆస్తులను కుటుంబానికి అప్పగించడానికి వీలునామా రాసి పెడతారు.

ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆస్తులను ఎలా పంపిణీ చేయాలనుకుంటున్నారో వివరించే వీలునామాను రూపొందించాలి. వీలునామాను పకడ్బందీగా రూపొందించడం వెనకాల మరో కారణం ఉంది. చట్టపరమైన కోర్టు సమస్యల నుంచి వారసులను తప్పించవచ్చు. ఆసక్తిని సరైన విధంగా పంపిణీ జరిగేటట్లుగా పర్యవేక్షించడానికి వీలుంటుంది. అలాగే వారసుల మధ్య విభేదాలు రాకుండా ఉండడానికి వీలునామా ఉపయోగపడుతుంది.

ఒకవేళ ఎవరైనా వీలునామా రాయకుండా మరణిస్తే.. వారి ఆస్తులు భారత దేశ వారసత్వ చట్టాల ఆధారంగా పంపిణీ చేస్తారు. అందుకే ప్రతీ ఒక్కరూ తమకు నచ్చిన విధంగా ఆస్తి పంపకాలు జరగాలంటే వీలునామా రూపొందించాలి. ఆస్తిని ఎలా పంపిణీ చేయాలనుకుంటున్నారో కచ్చితంగా పేర్కొనాలి. ఆస్తుల్లో కొంత భాగాన్ని వారసుల విద్యతో పాటు, ఇతర అవసరాల కోసం కేటాయించవచ్చు. పిల్లలు యుక్తవయస్సు వచ్చినప్పుడు ఈ నిధులను వారసత్వంగా పొందొచ్చు.

ఇక భారత్‌లో చట్టబద్ధంగా వీలునామా చట్టబద్ధంగా చెల్లుబాటు కావాలంటే.. వీలునామా సాధారణ కాగితంపై ముద్ర ఉండాలి. 18 ఏళ్లు పైబడిన వ్యక్తులు వీలునామా రాయడానికి అర్హులు. వీలునామా రాసుకునే సమయంలో కనీసం ఇద్దరు సాక్షులు ఉండాలి. అలాగే వీలునామా రాసే వ్యక్తి సంతకం తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ ఆన్‌లైన్‌లో వీలునామా తీసుకుంటే డిజిటల్‌ సంతకం చెల్లదు. ఆన్‌లైన్‌లో వీలునామా రాస్తే, ప్రింట్‌ తీసుకుని సంతకం చేయాలి.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this