Saturday, June 14, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Horoscope Today: ఆ రాశి వారికి ధన...

AP Teacher Transfers 2025 FAQs

AP Teacher Transfers 2025 FAQs మరియు వాటి సమాధానాలు ఇక్కడ...

Teacher Transfers 2025: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు!

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన...

విద్యారంగంలో నవశకం: Andhra Pradesh Teacher Transfers 2025 – ఉపాధ్యాయులకు గొప్ప ఊరట!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. 2025...

iQOO Neo 10: 120W ఫాస్ట్ ఛార్జింగ్, 7000mAh బ్యాటరీతో భారత్‌లో లాంఛ్ – ధర, ఫీచర్లు ఇవే!

iQOO Neo 10 భారత్ మార్కెట్‌లో మే 26న లాంఛ్ కానుంది....

Horoscope Today: ఆ రాశి వారికి ధన యోగం.. 12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు ఇలా..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 దినఫలాలు (నవంబర్ 20, 2023): మేష రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో అంచనాలకు మించి లాభాలు అందుతాయి. వృషభ రాశి వారికి రోజంతా దాదాపు బాగానే గడిచిపోతుంది. ఉద్యోగ జీవితం, ఆర్థిక పరిస్థితి అనుకూలంగా సాగిపోతాయి. మిథున రాశి వారికి ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

horoscope today: ఆ రాశి వారికి ధన యోగం.. 12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు ఇలా..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, వ్యాపారాలలో అంచనాలకు మించి లాభాలు అందుతాయి. దీర్ఘకాలిక ఆర్థిక సమస్యల నుంచి కొంత వరకు బయటపడతారు. ఉద్యో గంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కార మవుతుంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. భరణి వారికి ధన యోగం ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

రోజంతా దాదాపు బాగానే గడిచిపోతుంది. ఉద్యోగ జీవితం, ఆర్థిక పరిస్థితి అనుకూలంగా సాగిపోతాయి. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు పాటించడం మంచిది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. వ్యాపారం ఆశాజనకంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. రోహిణి నక్షత్రం వారికి అన్నిటా విజయం లభిస్తుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమా చారం అందవచ్చు. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. తలపెట్టిన పనులలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. పునర్వసు వారు ఎక్కువగా లబ్ధి పొందుతారు.

కర్కాటకం (పునర్వసు 4, పు‌ష్యమి, ఆశ్లేష)

ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. కానీ, ఉద్యో గంలో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి కరవవుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. తలపెట్టిన పనులు కొద్దిగా ఆలస్యంగా పూర్తవుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. మంచి కంపెనీల నుంచి ఆపర్లు అంది వస్తాయి. ప్రేమ వ్యవహారాలు మామూలుగా సాగిపోతాయి. పుష్యమివారికి బాగా డబ్బు కలిసి వస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు మంచివి. ముఖ్య మైన వ్యవహారాలు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అను కూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పుబ్బా నక్షత్రం వారు ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆర్థికంగా, కుటుంబపరంగా పరిస్థితులు మెరుగు పడతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల మీద శ్రద్ధ పెంచుతారు. ముఖ్య మైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా గడిచి పోతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉత్తరా నక్షత్రం వారు ఆశించిన శుభవార్త వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు విజయవంతం అవు తాయి. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు. విశాఖ వారికి ఆశించిన శుభవార్త అందు తుంది. కుటుంబ సభ్యుల సాయంతో ముఖ్యమైన కార్యకలాపాలు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపో తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వ్యక్తిగత సమస్యల మీద, వ్యవహారాల మీద శ్రద్ధ పెడతారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా వేగం పెరు గుతుంది. అదనపు ఆదాయం కోసం కొత్త ప్రయత్నాలు చేపడతారు. ఉద్యోగం ప్రశాంతంగా సాగి పోతుంది. ప్రస్తుతానికి హామీలు ఉండడం, వాగ్దానాలు చేయడం చేయవద్దు. జ్యేష్టా నక్షత్రం వారికి ఆకస్మిక ధన లాభం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలను విజయ వంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ప్రేమ వ్యవహారాలు పరవాలేదనిపిస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. ఉద్యోగపరంగా శుభవార్తలు అందే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా బిజీ అయిపోతారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఉద్యో గం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలించవచ్చు. నిరుద్యోగులకు శుభవార్త అందవచ్చు. కొందరు బంధువుల వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. పూర్వాషాడవారికి ఆశించిన శుభవార్త అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

కుటుంబ సమస్యల మీద, కుటుంబ వ్యవహారాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి అంచనాలకు మించి లాభాలు అందే అవకాశం ఉంది. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడు తుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఉత్తరాషాఢ వారికి ఆదాయవృద్ధి ఉంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

సమయం బాగా అనుకూలంగా ఉంది. కుటుంబానికి సంబంధించిన ప్రయత్నాలు సఫలం అవు తాయి. ఆదాయం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడుతాయి. నిరుద్యోగులకు శుభ వార్తలు అందు తాయి. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శతభిషం నక్షత్రం వారికి ఆశించిన శుభవార్త అందుతుంది. ప్రేమ వ్యవహారాలు నిదానంగా సాగుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

బంధువుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇతరత్రా అంతా అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలలో తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. వృత్తి, వ్యాపా రాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆఫర్లు అందివస్తాయి. ఆరోగ్యానికి లోటు ఉండదు. కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. ఉత్తరాభాద్ర వారికి ఆకస్మిక ధన లాభముంది. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది.

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this