Corona : కరోనా మరోసారి విజృంభించనుందా?

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

Corona : కరోనా మరోసారి విజృంభించనుందా?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Corona : కరోనా మరోసారి విజృంభించనుందా?

corona : కరోనా మరోసారి విజృంభించనుందా?

లండన్‌ : ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌.. మరోసారి విజృంభించేందుకు సిద్ధంగా ఉందని వైద్య నిపుణలు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ నుంచి పుట్టుకొచ్చిన బీఏ.2.86 వేరియంట్‌ లేదా పిరోలా ప్రస్తుతం బ్రిటన్‌లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. బహుశా ఈ వేరియంట్‌ ప్రభావం భారత్‌లో కూడా ఉండనుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్‌ సోకినవారు బాగా అలసటకు గురవుతారు. అలాగే నొప్పులు, జ్వరం, ముక్కుకారటం, గొంతునొప్పి, కళ్లలో మంట, చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయని, శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
కాగా, ఈ కొత్త వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందని.. ఇప్పటికే ఈ వేరియంట్‌ కేసులు బ్రిటన్‌లో అధికంగా నమోదవుతున్నాయని యూకే హెల్త్‌ సెక్యూరిటీ ఏజెన్సీ (యూకేహెచ్‌ఎస్‌ఏ) తెలిపింది. ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్తగా టీకాల ప్రచారాన్ని యూకేహెచ్‌ఎస్‌ఏ ముమ్మరం చేసింది. కరోనా టీకా బూస్టర్‌ డోసు తీసుకోని వారు వెంటనే ఈ డోస్‌ తీసుకోవాలని వైద్యాధికారులు ప్రజలకు సూచించారు. ముఖ్యంగా రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండాలని, మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. గత జూలై నెలలో బీఏ.2.86 కేసులు నమోదయ్యాయి.

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this