Aadhaar-Bank Account Link: ఆధార్‌తో మీ బ్యాంకు...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Aadhaar-Bank Account Link: ఆధార్‌తో మీ బ్యాంకు అకౌంట్ లింక్ అయ్యిందా లేదా? ఇలా చెక్ చేసుకోండి.. లేకుంటే ఇబ్బందులు పడతారు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లోని 12,000 మందికి పైగా విద్యార్థులు తమ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలతో ఆధార్‌ను లింక్ చేయకపోవడంతో 2022-23కి సంబంధించిన స్కాలర్‌షిప్ మొత్తాలను పొందలేకపోయారని ఓ నివేదిక తెలిపింది. ఆ క్రమంలో మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కు లింక్ అయి ఉందా లేదా అనే దాన్ని సరిచూసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం మీరు య యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) పోర్టల్ లోకి వెళ్లాల్సి ఉంటుంది.

aadhaar-bank account link: ఆధార్‌తో మీ బ్యాంకు అకౌంట్ లింక్ అయ్యిందా లేదా? ఇలా చెక్ చేసుకోండి.. లేకుంటే ఇబ్బందులు పడతారు..

మన దేశంలో ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన గుర్తింపు. ఇది ఉంటేనే మన దేశంలో సిటిజెన్ గా హక్కులు పొందుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అందించే ఏ పథకానికి అయినా ఈ ఆధార్ కార్డు ఉండాల్సిందే. ఇటీవల కాలంలో ప్రభుత్వం వ్యక్తులు తమ ఆధార్ కార్డుతో బ్యాంకు ఖాతాలను లింక్ చేయాలని సూచించింది. దానికి పలు దఫాలుగా గడువులు కూడా ఇచ్చింది. అయితే చాలా మంది ఇప్పటికీ తమ బ్యాంకు ఖాతాలతో ఆధార్ కార్డులను లింక్ చేయలేదు. దీంతో వ్యక్తుల ఆర్థిక లావాదేవీలకు ఇబ్బంది అవుతోంది. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లోని 12,000 మందికి పైగా విద్యార్థులు తమ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలతో ఆధార్‌ను లింక్ చేయకపోవడంతో 2022-23కి సంబంధించిన స్కాలర్‌షిప్ మొత్తాలను పొందలేకపోయారని ఓ నివేదిక తెలిపింది. ఆ క్రమంలో మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కు లింక్ అయి ఉందా లేదా అనే దాన్ని సరిచూసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం మీరు య యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) పోర్టల్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. అందులో మై ఆధార్ సెక్షన్లో వ్యక్తుల ఆధార్ నంబర్‌తో ఏ బ్యాంక్ ఖాతా లింక్ చేయబడిందో తనిఖీ చేయవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి బహుళ బ్యాంకు ఖాతాలను కలిగి ఉంటే, ఒక ఖాతాకు మాత్రమే ఆధార్‌తో లింక్ చేయవచ్చు. అది ఎలా తనిఖీ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇలా తనిఖీ చేయండి..

  • మొదటిగా మై ఆధార్ పోర్టల్(https://myaadhaar.uidai.gov.in/)లోకి వెళ్లాలి.
  • లాగిన్‌పై క్లిక్ చేయండి. కొత్త వెబ్‌పేజీ తెరుచుకుంటుంది. మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, క్యాప్చా ఛాలెంజ్‌ని పూరించండి. ఆపై ‘సెండ్ ఓటీపీ’ ని క్లిక్ చేయండి. ఫోన్ నంబర్ కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ‘లాగిన్’ పై క్లిక్ చేయండి.
  • అప్పుడు మళ్లీ కొత్త వెబ్‌పేజీ తెరవబడుతుంది. ‘బ్యాంక్ సీడింగ్ స్టేటస్’ శీర్షికతో ఉన్న బటన్‌కు నావిగేట్ చేసి.. దానిపై క్లిక్ చేయండి. పేజీ లోడ్ కావడానికి కొన్ని కన్ల సమయం పడుతుంది. ఆ తర్వాత మీ ఆధార్‌తో లింక్ చేయబడిన బ్యాంక్ అకౌంట్ ను మీకు చూపుతుంది.

ఆధార్ స్టేటస్ ఇలా..

ఆధార్ స్టేటస్‌తో బ్యాంక్ ఖాతా సీడింగ్ వివరాలు ‘యాక్టివ్’ లేదా ‘ఇనాక్టివ్’గా చూపిస్తాయి. ఇది కాకుండా, బ్యాంక్ సీడింగ్ పేజీ మొత్తం నాలుగు వివరాలను చూపుతుంది. చూపబడిన మొదటి సమాచారం ఆధార్ నంబర్‌లోని చివరి నాలుగు అంకెలు కనిపిస్తాయి. ఇతర అంకెలు ముసుగు వేయబడి ఉంటాయి. రెండో సమాచారం ‘బ్యాంక్ పేరు’. మూడో సమాచారం బ్యాంక్ సీడింగ్ స్థితి (యాక్టివ్/ఇనాక్టివ్). సీడింగ్ స్థితి చివరిగా ఎప్పుడు అప్‌డేట్ చేయబడింది అనేది నాల్గో సమాచారం. బ్యాంక్ ఖాతా సీడింగ్ పేజీ దిగువన ఒక హెచ్చరిక సందేశం కూడా కనిపిస్తుంది.లింక్ ద్వారా అందించబడిన సమాచారం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సర్వర్ నుంచి తీసుకున్నమని చెబుతుంది. దాని కచ్చితత్వానికి యూఐడీఏఐ బాధ్యత వహించదు. అలాగే కనిపించిన సమాచారం యూఐడీఏఐ స్టోర్ చేయదు. అయితే మీ బ్యాంక్ ఖాతాల్లో ఏవి ఆధార్‌తో లింక్ అయ్యాయో తెలుసుకునేందుకు, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) గురించి తెలుసుకోవడంలో మీకు సహాయపడుతుంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this