Salaries : రూ.35 వేల కోట్లు దారి...

AP Inter Results 2026 Today Live: Direct Links for 1st & 2nd Year Results, WhatsApp Mana Mitra Process, SMS Method

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

Salaries : రూ.35 వేల కోట్లు దారి మళ్లించారు.. జీతాలు ఇవ్వాలంటే అప్పు తేవాల్సిన పరిస్థితి

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 గ్రామ పంచాయతీ నిధులపై మళ్లీ కదం తొక్కారు సర్పంచ్‌లు. ప్రభుత్వం నిర్దేశించిన పనులను అప్పు చేసి పూర్తి చేశాం.. ఇప్పటికైనా నిధులు విడుదల చేయండి మహాప్రభో అని నినదించారు. సర్పంచ్‌ల శంఖారావానికి మద్దతిచ్చింది తెలంగాణ కాంగ్రెస్‌.

Salaries : రూ.35 వేల కోట్లు దారి మళ్లించారు.. జీతాలు ఇవ్వాలంటే అప్పు తేవాల్సిన పరిస్థితి

salaries : రూ.35 వేల కోట్లు దారి మళ్లించారు.. జీతాలు ఇవ్వాలంటే అప్పు తేవాల్సిన పరిస్థితి

ప్రగతి పేరుతో ప్రభుత్వ లక్ష్యాలు.. గడువులోగా పూర్తికాకుంటే అధికారుల హెచ్చరికలు.. వెనుకడుగు వేస్తే ప్రజల ఒత్తిళ్లు. వీటన్నింటి మధ్య గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్‌ సతమతమవుతున్నాడు. అయితే తెలంగాణ ప్రభుత్వం పంచాయతీల నిధులు మళ్లించిందనే ఆరోపణలతో సర్పంచ్‌లో కొద్దిరోజులుగా ఆందోళనకు దిగుతున్నారు. లేటెస్ట్‌గా హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్‌ సంఘటన్‌ ఆధ్వర్యంలో నిధులు, విధులపై సర్పంచ్‌ల శంఖారావం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా.. కేంద్రం ఇస్తున్న ఆర్థిక సంఘం నిధులు మళ్లించిందన్నది సర్పంచ్‌ల ఆరోపణ.

గ్రామాల్లో చాలా పనులు పెండింగ్‌లో ఉన్నాయని.. అవి పూర్తి కావాలంటే నిధులు వెంటనే విడుదల చేయాలంటున్నారు. తమకు తెలియకుండా రాష్ట్ర పంచాయతీ రాజ్‌ అధికారులు.. బ్యాంకు ఖాతాల డిజిటల్‌ కీ ఆధారంగా ఈ నిధులను విత్‌ డ్రా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్‌ల శంఖారావానికి తెలంగాణ కాంగ్రెస్‌ మద్దతిచ్చింది. గ్రామపంచాయతీల నిధులు ప్రభుత్వం దారి మళ్లించడంతో సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి.

తెలంగాణ ప్రభుత్వం మాత్రం సర్పంచ్‌లు, విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణల్ని ఖండిస్తోంది. ప్రభుత్వ ఖాతాల్లోకి నిధులు మళ్లించలేదంటోంది. కేంద్ర ఆర్థిక సంఘం మొదటి విడత నిధులను ఖర్చు చేస్తేనే రెండో విడత నిధులు విడుదలవుతాయని.. అందుకే ఖర్చు చేసిన నిధులకు సంబంధించిన బిల్లులకి చెల్లించామంటోంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this