ఇదేనా రెస్పాన్సిబిలిటీ ? అధికారులపై, ఉపాధ్యాయుల పై...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

ఇదేనా రెస్పాన్సిబిలిటీ ? అధికారులపై, ఉపాధ్యాయుల పై విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆగ్రహం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • వర్క్ బుక్స్ ఉపయోగించరేమీ?
  • పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆగ్రహం
  • బొబ్బిలి గురుకుల పాఠశాల ఆకస్మిక సందర్శన

Filephoto

విజిటింగ్ వీడియో

‘పాఠశాలల్లో గోడలు, బల్లలు చూపించడం కాదు. విద్యా ప్రమాణాలు పెంచాలి. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి వర్క్‌ బుక్స్‌తో పాటు నోటు పుస్తకాలు అందిస్తే వినియోగించరా?ఉపాధ్యాయుల్లో రెస్పాన్స్‌బిలిటీ, అకౌంట్‌బులిటీ లేవు’..అంటూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో స్థానిక ప్రభుత్వ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. నేరుగా ఆరో తరగతి గదిలో ప్రవేశించారు. పాఠ్య పుస్తకాలతో పాటు వర్క్‌బుక్స్‌, నోట్‌ బుక్స్‌ అందరి వద్ద ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. బయటకు తీసి సిద్ధంగా ఉంచాలని విద్యార్ధులకు సూచించారు. కొంతమంది విద్యార్థులు పుస్తకాలను పరిశీలించగా..వాటిలో ఎటువంటి రాతలు కనిపించలేదు. దీంతో ప్రవీణ్‌ ప్రకాష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాల సొసైటీ కార్యదర్శి నరసింహారావును, ప్రిన్సిపాల్‌ రఘునాథ్‌తో పాటు ఉపాధ్యాయుల తీరును తప్పుపట్టారు. రాష్ట్రంలో ఎన్ని పాఠశాలలను ఇంతవరకూ తనిఖీ చేశారంటూ సొసైటీ కార్యదర్శిని ప్రశ్నించారు. 110 పాఠశాలలని ఆయన చెప్పగా, మరెందుకు ఇలా ఉన్నాయని నిలదీశారు. పనిచేయని వారిపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. అటు విద్యార్థులను మరో గదిలోకి పంపించారు. మీడియాను సైతం బయలకు వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు. సిబ్బందితో సమావేశమై గట్టిగానే హెచ్చరికలు జారీచేసినట్టు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు మరోసారి వస్తానని.. రికార్డులను సక్రమంగా ఉంచాలని.. లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రుసరుసలాడుతూ కారెక్కి కేజీబీవీకి వెళ్లిపోయాయి. ఆయన వెంట డీఈవో లింగేశ్వరరెడ్డి, డిప్యూటీ డీఈవో నాయుడు ఉన్నారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this