Andhra Pradesh: దౌర్జన్యాలు చేస్తే తీవ్ర ఉద్యమాలే...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Andhra Pradesh: దౌర్జన్యాలు చేస్తే తీవ్ర ఉద్యమాలే వస్తాయి.. వైసీపీ నేతలకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 వైసీపీ రూలింగ్ పై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మరోసారి ఫైర్ అయ్యారు.

andhra pradesh: దౌర్జన్యాలు చేస్తే తీవ్ర ఉద్యమాలే వస్తాయి.. వైసీపీ నేతలకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్

Andhra Pradesh: దౌర్జన్యాలు చేస్తే తీవ్ర ఉద్యమాలే వస్తాయి.. వైసీపీ నేతలకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్

అధికార దాహంతో పరిపించే వైసీపీ నాయకులంటే తనకు అస్సలు ఇష్టం ఉండదని వ్యాఖ్యానించారు. నాయకుడు కబ్జాలు చేసి, లంచాలు తీసుకుంటే భరించగలమన్న పవన్.. అతడి లక్షణాలు గ్రామ స్థాయి కార్యకర్తల వరకు చేరితే ఎలా చూస్తూ ఊరుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ (YCP) నేతలు అవినీతికి పాల్పడుతున్నారని.. వీటిని ఇప్పుడు అడ్డుకోలేకపోతే ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాకోరల్లోంచి భూమిని అసలైన యజమానులకు అందించాలని డిమాండ్ చేశారు. అధికారం ఉంది కదా అని దౌర్జన్యాలు చేస్తే.. తీవ్ర ఉద్యమాలే వస్తాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దౌర్జన్యాలను ఆపకపోతే ప్రజలు తిరగబడే రోజులు త్వరలోనే వస్తాయని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు జనసేన పార్టీ కృషి చేస్తోందని పవన్ కల్యాణ్‌ వెల్లడించారు. విజయవాడలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సీఎం సహాయనిధి, ఆరోగ్యశ్రీకి సంబంధించిన అర్జీలు ఎక్కువగా వచ్చాయి. ప్రజలు ఇచ్చిన వినతులను సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తున్నాం. రాష్ట్రంలో పై స్థాయిలో ఉన్న నాయకులు ఏం చేస్తున్నారో కింది స్థాయి కార్యకర్తలు కూడా అదే పని చేస్తున్నారు. అధికార దాహంతో పరితపిస్తుంటారు కాబట్టే వైసీపీ నేతలంటే నాకు చిరాకు. నాయకుడి లక్షణాలు గ్రామ స్థాయి నేతల వరకు చేరితే ఎలా భరించగలం. దౌర్జన్యాలు పెరిగితే ఏదో ఒకరోజు ప్రజలే తిరగబడతారు.

       – పవన్ కల్యాణ్, జనసేన అధినేత

 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this