Teacher Demands : న్యాయ బద్ధమైన మరో...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Teacher Demands : న్యాయ బద్ధమైన మరో పోరాటానికి సిధ్ధమైన ఉపాధ్యాయులు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలు రూపొందించడంలో  నిర్లక్ష్యం వహిస్తున్న రాష్ట్ర విద్యాశాఖ అధికారుల తీరును నిరసిస్తూ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్ల వద్ద 10-06 -2022 న ధర్నా నిర్వహించాలని మరియు రాష్ట్ర స్థాయిలో విజయవాడ ధర్నా చౌక్ నందు 17-06 -2022  నుండి రిలే నిరాహార దీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యవర్గం తీర్మానించినట్లు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు జి. వి నారాయణ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. శ్రీనివాసరావు ప్రకటన లో తెలిపారు.

వీరి ప్రధాన డిమాండ్లు

► 1) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రిబ్యునల్ రద్దు  అయినందున హైకోర్టు నుండి అనుమతి తీసుకొని G O MS No 73 మరియు G O MS No 74  తేదీ 20-09-2017 ప్రకారం ఉన్నత పాఠశాల ల ఉపాధ్యాయులకు మరియు ప్రధానోపాధ్యాయులకు వెంటనే పదోన్నతులు చేపట్టాలి.

► 2) జిల్లా విద్యాశాఖ అధికారులు గాను  మరియు ఉప విద్యాశాఖ అధికారులు గాను పనిచేస్తున్న బోధనేతర సిబ్బందిని తొలగించి వారి స్థానంలో  అర్హత కలిగిన సీనియర్ ప్రధానోపాధ్యాయులకు  మరియు మండల విద్యాశాఖ అధికారులకు పదోన్నతులు ఇవ్వాలి.

► 3) సమగ్ర శిక్షా లో అసిస్టెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు గా పనిచేస్తున్న ఇతర శాఖల సిబ్బందిని మరియు విద్యా శాఖలో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్లను తొలగించి సీనియర్ ప్రధానోపాధ్యాయులను మాత్రమే, 26 జిల్లాలలో అసిస్టెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్లుగా నియమించాలి. వీరిని  నియమించుటకు అనుగుణంగా  నిబంధనలను రూపొందించాలి. 

► 4) ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 40 శాతం లెక్చరర్ పోస్టులను, డైట్ కళాశాలల్లో, యస్ సి ఇ ఆర్ టి లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను మరియు మండల విద్యాశాఖ అధికారుల పోస్టులను ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న  ఉపాధ్యాయులతో మరియు ప్రధానోపాధ్యాయులతో పదోన్నతుల ద్వారా భర్తీ చేయవలెను. జూనియర్ కళాశాలల్లో 50 శాతం లెక్చరర్ పోస్టులలో కళాశాలల్లో  తాత్కాలికముగా పనిచేస్తున్న అధ్యాపకులను పర్మినెంట్ చేయాలి.

► 5) ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ  కార్యాలయాల్లో సూపరింటెండెంట్లు గాను  ప్రధానోపాధ్యాయులను  అసిస్టెంట్ డైరెక్టర్లు గాను విద్యేతర కార్యక్రమాల నిర్వహణ, కార్యాలయ అనుభవం కొరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో డెప్యుటేషన్ పై ఒక సంవత్సర కాలము నియమించ వలెను.

► 6) ఏకీకృత సర్వీసు నిబంధనల వలన ఏర్పడిన సమస్యకు పరిష్కారంగా మున్సిపల్ పాఠశాలలకు, ప్రభుత్వ పాఠశాలలకు మరియు పంచాయతీరాజ్ పాఠశాలలకు విడివిడిగా పర్యవేక్షణా అధికారులుగా ఆయా మేనేజ్మెంట్ లలో పనిచేస్తున్న సీనియర్ ప్రధానోపాధ్యాయులను  నియమించే  విధంగా  నిబంధనలు రూపొందించి పదోన్నతులు కల్పించాలి.

► 7) ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్న ఇంటర్మీడియట్ తరగతులకు బోధించుటకు స్కూల్ అసిస్టెంట్ లను జూనియర్ లెక్చరర్లుగా మరియు గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయుల పోస్టులను గ్రేడ్-1 ప్రధానోపాధ్యాయుల పోస్టులుగా ఉన్నతీకరించాలి. 500 మంది విద్యార్థులు ఉన్న అన్ని ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్ 2  ప్రధానోపాధ్యాయుల పోస్ట్ ను గ్రేడ్ 1  గా ఉన్నతీకరించి  పదోన్నతులు ఇవ్వాలి.

► 8) విద్యార్థుల సంఖ్య తో నిమిత్తం లేకుండా అన్ని ఉన్నత పాఠశాలల్లో  గ్రేడ్-2  ప్రధానోపాధ్యాయులు, ఫిజికల్ డైరెక్టర్ పోస్టును మరియు అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులను కొనసాగించాలి. ఉన్నతీకరించబడిన అన్ని ఉన్నత  పాఠశాలలకు గ్రేడ్-2  ప్రధానోపాధ్యాయుల పోస్ట్, ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్ మరియు అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయుల  పోస్టులను మంజూరు చేయాలి.

► 9) నాడు – నేడు పేస్ 2 పనులలో ప్రధానోపాధ్యాయులను పర్యవేక్షణ వరకే పరిమితం చేయాలి. అప్లోడింగ్ బాధ్యతలన్నీ కూడా సెక్రటేరియట్ లో పనిచేస్తున్న విద్యా కార్యదర్శి కి లేదా సి ఆర్ పి కి అప్పగించాలి. ఫేస్ 1 లో పనిచేసిన ప్రధానోపాధ్యాయులకు  యన్ క్యాష్ మెంట్ తో కూడిన సంపాదిత సెలవులు మంజూరు చేయాలి.

► 10) అన్ని ఉన్నత పాఠశాలల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్ మరియు నైట్ వాచ్ మెన్ ను నియమించాలి.  పాఠశాలలకు అవసరమైన నిర్వహణా నిధులను పాఠశాలలు ప్రారంభం అయ్యే నాటికి  విడుదల చేయాలి.

► 11) ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం సిపిఎస్ ను  రద్దు చేసి ఓ పి ఎస్ ను మాత్రమే అమలు పరచాలి.

https://i.imgur.com/uvc2qvu.png


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this