Wednesday, July 30, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Whatsapp: వాట్సాప్‌లో మరో రెండు అదిరిపోయే ఫీచర్లు.....

Whatsapp: వాట్సాప్‌లో మరో రెండు అదిరిపోయే ఫీచర్లు.. ఇకపై మీకు నచ్చిన భాషలో..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Whatsapp: ప్రత్యర్థి కంపెనీల పోటీని ఎదుర్కోవడంలో వాట్సాప్‌ ఎల్లప్పుడూ ముందుంటుంది. ఇందులో భాగంగానే కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. రకరకాల మెసేజింగ్‌ యాప్స్‌ అందబాటులోకి వచ్చి నేపథ్యంలో యూజర్లను చేజారిపోకుండా వాట్సాప్‌ ఎప్పటికప్పుడు.. 

Whatsapp: వాట్సాప్‌లో మరో రెండు అదిరిపోయే ఫీచర్లు.. ఇకపై మీకు నచ్చిన భాషలో..

Whatsapp: ప్రత్యర్థి కంపెనీల పోటీని ఎదుర్కోవడంలో వాట్సాప్‌ ఎల్లప్పుడూ ముందుంటుంది. ఇందులో భాగంగానే కొంగొత్త ఫీచర్లను (Features) పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. రకరకాల మెసేజింగ్‌ యాప్స్‌ (Apps) అందబాటులోకి వచ్చి నేపథ్యంలో యూజర్లను చేజారిపోకుండా వాట్సాప్‌ ఎప్పటికప్పుడు కొత్త ఆప్షన్స్‌ను పరిచయం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తాజాగా మరో రెండు కొత్త ఫీచర్లను తీసుకొచ్చే పనిలో పడింది వాట్సాప్‌. ఈ ఫీచర్లకు సంబంధించిన వివరాలను వాట్సాప్‌ బీటాఇన్ఫోలో సూచనప్రాయంగా తెలిపింది. వాట్సాప్‌ తీసుకురానున్న ఫీచర్లు ఇవే..

లాంగ్వేజ్‌ ఫీచర్‌..

వాట్సాప్‌ ఇప్పటి వరకు కేవలం ఇంగ్లిష్‌ భాషలో మాత్రంమే అందుబాటులో ఉంది. అయితే తాజాగా ఇతర భాషల్లోకి కూడా అందబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది. యూజర్లకు సెట్టింగ్స్‌లోకి తమకు నచ్చిన భాషను సెలక్ట్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నట్లు సమాచారం. అయితే వాట్సాప్‌ ఈ ఆప్షన్స్‌ను ఏయే భాషలలో అందిస్తుందన్న విషయం మాత్రం తెలియాల్సి ఉంది. మొదట ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌ 2.22.9.13 వెర్షన్‌ వాడే వారికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్ ప్రయాత్నాలు చేస్తున్నట్లు టాక్‌. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.

వాట్సాప్‌ గ్రూప్స్‌లో పోల్‌ ఆప్షన్‌..

వాట్సాప్‌ గ్రూప్‌లో ఏదైనా ఒక విషయంపై పోలింగ్ నిర్వహించి ఇతరుల అభిప్రాయాలను తెలుసుకునే పోల్స్‌ ఫీచర్‌పై వాట్సాప్‌ గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఫీచర్‌ టెస్టింగ్ చివరి దశకు చేరకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో భాగంగా పోల్ రూపొందించడానికి ముందు ఒక ప్రశ్నకు నమోదు చేయాల్సి ఉంటుంది. యూజర్లు ఓటు వేయడాఇనకి మల్టీపుల్ ఆప్షన్స్‌ ఇవ్వాలి. పోల్ ముగిసన తర్వాత ఫలితాలు వెలువడుతాయి. అయితే గ్రూప్‌ అడ్మిన్‌లు పోల్‌ ఆప్షన్స్‌ను మార్చగలరా.? పోలింగ్‌కు టైం లిమిట్‌ ఉంటుందా.? అన్న వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.

whatsapp: వాట్సాప్‌లో మరో రెండు అదిరిపోయే ఫీచర్లు.. ఇకపై మీకు నచ్చిన భాషలో..

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this